ఢిల్లీలో కరోనా బాధితులకు బెడ్ల కొరత ఉన్న తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్

అందుబాటులోకి వచ్చింది.3 వరాల క్రితం జరిగిన సమావేశంలో కేజ్రీవాల్  అభ్యర్ధనను అంగీకరించిన

అమిత్ షా ఢిల్లీ రాధాస్వామి సత్సంగ్ స్థలంలో ఆర్మీ ఐటీబీపీ హెల్త్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో కోవిడ్

కేర్ సెంటర్ ఏర్పాటుకు అంగీకరించారు.పది వేల బెడ్ల కెపాసిటీ ఉన్నఈ కోవిడ్ కేర్ సెంటర్లో 

ప్రస్తుతం రెండు వేల బెడ్లు అందుబాటులోకి వచ్చాయి.త్వరలోనే మిగితా బెడ్లు అందుబాటులోకి 

వస్తాయని ఆర్మీ ఐటీబీపీ అధికారులు తెలిపారు.మొన్నటివరకు వలసకూలీలకు ఆశ్రయం ఇచ్చిన

రాధాస్వామి సత్సంగ్ స్థలంలో ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్ రూపుదిద్దుకుంది.పన్నెండున్నర లక్షల

చదరపు అడుగుల స్థలంలో కమ్యూనిటీ కిచెన్ కూడా అందుబాటులో ఉన్నాయి.రెండు వందల బెడ్ల

చొప్పున 50 ఎన్క్లోసుర్లు రెడీ చేసారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కలిసి

కోవిడ్ కేర్ సెంటర్ ను పరిశీలించారు.అక్కడి వసతులని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

You Might Also Like