ఢిల్లీకి రాజైన లాక్‌డౌన్‌ కష్టాలు తప్పేటట్టు లేవు.కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ప్రభావం ప్రజాజీవితం పై  తీవ్ర ప్రభావం చూపుతోందనడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సంఘటనే ఒక ఉదాహరణ .లాక్గ డౌన్త తో  నెల రోజులుగా దిల్లీలోనే ఉండి కరోనా కట్టడి పర్యవేక్షణ బాధ్యతలను చూస్తున్నా అయన తన తల్లి ఆండాళమ్మ సంవత్సరీకం నిర్వహించేందుకు స్వగ్రామానికి వెళ్లలేని దుస్థితి. కన్నా తల్లికి ఆబ్దికం పెట్టడానికి   ఆయన భార్య, పిల్లలు, సోదరులు బంధువులు అందరూ స్వగ్రామం తిమ్మాపూర్‌  లో ఉండగా అయన దిల్లీలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయన స్వగ్రామంలో అర్చకులు సోదరులు కార్యక్రమం నిఎవహిస్తుండగా  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అయన వారితో కలిసి కార్యక్రమం పూర్తి చేశారు.హోంశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తాను స్వయంగా లాక్‌డౌన్‌ నియమాన్ని ఉల్లంఘించాలని అనుకోవట్లేదని ప్రజలకు ఆదర్శంగా ఉండేందుకు కొంత బాధ  ఉన్నప్పటికీ ఢిల్లీ నుండే ఈ కార్యక్రమం పూర్తి చేశానని ఈ  సందర్భంగా కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.కాగా ఆప్తులకు అంతరంగీకులకు అయన ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

You Might Also Like