భారత్‌లో కరోనా మహమ్మారి అంతకంతకు విస్తరిస్తుంది.ఇప్పటివరకు కరోనా తో 414 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. గడచిన 24గంటల్లోనే దేశవ్యాప్తంగా  37 మంది మృత్యువాత పడగా కొత్తగా 941 పాజిటివ్‌ కేసులు నమోదు అయినయని బాధితుల సంఖ్య 12వేలు దాటిందాని వారు తెలుపుతున్నారు.దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,380కి చేరింది. మొత్తం బాధితుల్లో 1489మంది కోలుకోగా ప్రస్తుతం మరో 10,477మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 76మంది విదేశీయులు ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 170జిల్లాలను హాట్‌స్పాట్‌ ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది. వీటిలో తెలంగాణలో ఎనిమిది, ఆంధ్రప్రదేశ్‌లో 11జిల్లాలను హాట్‌స్పాట్‌ ప్రాంతాలుగా గుర్తించింది. దేశంలోని ఆరు మెట్రో నగరాలు కూడా హాట్‌స్పాట్‌ ప్రాంతాలుగా ఉన్నాయి. హాట్‌స్పాట్‌లుగా గుర్తించని ప్రాంతాల్లో ఏప్రిల్‌ 20నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలకు సడలింపు ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.

You Might Also Like