దేశవ్యాప్తంగా కరోనా పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నాయి.మహమ్మారి కట్టడిపైనే అధికంగా 

దృష్టి పెట్టాయి ఈ తరుణంలో ఉగ్రవాదులు చాపకింద నీరులా తమ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు.భారీ

కుట్రచేస్తున్నారు.తాజాగా ఢిల్లీపై అలాంటి స్కెచ్ వేసినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో ఢిల్లీలో 

హై అలెర్ట్ ప్రకటించారు.ఢిల్లీలో భారీ విధ్వంసం స్కెచ్ వేసినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

అయిదుగురు టెర్రరిస్టులు కాశ్మీర్ నుంచి ట్రాక్లో వచ్చారని ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారని హెచ్చరించాయి 

ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసాయి.ఉగ్రవాదులు రోడ్డు మార్గంలోనే నగరంలోకి చొరబడి ఉంటారని 

తనిఖీలు ముమ్మరం చేయాలనీ సూచించాయి.ఇప్పటికే ఢిల్లీలోని గెస్టుహౌసులు హోటళ్ళకి లుకౌట్

నోటీసులు జారీచేశారు.జమ్మూ కాశ్మీర్ రెజిస్ట్రేషన్లతో వాహనాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు.

అన్ని బస్టాండ్లురైల్వే స్టేషన్లు అప్రమత్తం చేసారు .ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించిన పోలీసులకు

సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.

You Might Also Like