కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అతలాకుతలమవుతుంటే పాకిస్తాన్ ప్రేరేపిత  ఉగ్రవాదులు మాత్త్రం భారత్ ను దొంగ దెబ్బ  తీయాలని యత్నిస్తునే  ఉన్నారు.ఫలితం గా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కుప్వారా జిల్లాల్లోని హంద్వారాలో జవాన్లు ఉగ్రవాదుల మధ్య శనివారం సాయంత్రం నుండి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఐదుగురు మృతుల్లో ఓ కమాండింగ్‌ ఆఫీసర్, మేజర్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.కాగా కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.


హంద్వారాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో జవాన్లు తనిఖీలు చేపట్టగా ఉగ్రవాదులు దాడికి దిగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు హతమార్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీల నేపథ్యంలో హంద్వారాలో ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని నిలిపివేశారు.  మృతిచెందిన జ‌వాన్ల‌లో ఒక‌రు 21 రాష్ట్రీయ రైఫిల్స్ క‌ల్న‌ల్‌, క‌మాండింగ్ ఆఫీస‌ర్ అశుతోష్ శ‌ర్మ‌ కాగా, ఒక మేజ‌ర్‌, మ‌రో ఇద్ద‌రు సైనికులు, జ‌మ్ముక‌శ్మీర్‌కు చెందిన ఒక‌ స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్‌ ఉన్నారని చెప్పారు. కుప్వారా జిల్లా హంద్వారా సెక్టార్లోని చాంజ్‌ముల్లా ఏరియాలో శ‌నివారం సాయంత్రం నుంచి 15 గంట‌ల‌పాటు ఎదురుకాల్పులు కొన‌సాగాయ‌ని ఆర్మీ అధికారులు వెల్ల‌డించారు. 

You Might Also Like