జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు, సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్య సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. దక్షిణ కాశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్​లో నలుగురు చనిపోయారని రక్షణ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా మీడియాకు తెలిపారు. సెక్యూరిటీ ఫోర్సెస్ పెట్రోలింగ్ పార్టీపై టెర్రరిస్టులు కాల్పులు జరిపిన తర్వాత మనవాళ్లు ప్రతీకారం తీర్చుకున్నారని చెప్పారు.కాగా ఘ‌ట‌నా స్థ‌లంలో ఒక ఉగ్ర‌వాది మృత‌దేహాన్ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గుర్తించాయి. మ‌రో మూడు మృత‌దేహాల కోసం గాలింపు కొన‌సాగుతున్న‌ది. సోమ‌వారం ఉద‌యం 24, 18 బెటాలియ‌న్ల‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు, రాష్ట్రీయ రైఫిల్స్ ద‌ళం, జ‌మ్ముక‌శ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఉగ్ర‌వాదుల కోసం గాలిస్తుండ‌గా లోవ‌ర్‌ముందా ఏరియాలో ముగ్గ‌రు ఉగ్ర‌వాదులు తార‌స‌ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టాయి.

You Might Also Like