సరిహద్దులో 20 మంది భారత జవవాన్లను పొట్టన పెట్టుకున్న చైనాకు వ్యతిరేకంగా యావతదేశం ఆగ్రహం

వ్యక్తం చేస్తోంది.చైనా వస్తువులను బహిష్కరించాలని డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.అధికారికంగా 

కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.అయితే మహారాష్ట్ర ప్రభుత్వం

ఆ దిశగా తొలి అడుగువేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది చైనా కంపెనీలతో చేసుకున్న సుమారు 5000 కోట్ల

రూపాయల ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు ఉద్దవ్ ప్రభుత్వం ప్రకటించింది.మాగ్నెటిక్ మహారాష్ట్ర 2 .౦

పెట్టుబడుల సదస్సులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రాజెక్టులకు సంబంధించి చైనా సంస్థలతో

గతంలోనే ఒప్పందాలు చేసుకుంది.తాజా పరిణామాలతో వాటిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది,కేంద్ర

ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.ప్రస్తుతానికి

ఈ ప్రాజెక్టు నిలిపివేశామని కేంద్రం నుంచి తదుపరి ఆదేశాల గురించి చూస్తున్నాం అని తెలిపారు.మహారాష్ట్రా

సర్కార్ రద్దు చేసిన వాటిలో ఆటోమొబైల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రేఅత్వాల్ మోటార్స్ సంస్థ చేసుకున్న 3770  

కోట్ల ఒప్పందం పీఎంఓ ఎలెక్ట్రోమొబిలిటీ చేసుకున్న 1000 కోట్ల ఒప్పందం హేంగ్లీ ఇంజనీరింగ్ సంస్థ

చేసుకున్న 250 కోట్ల ప్రాజెక్టులు ఉన్నాయి.ఇప్పటికే భారత్ రైల్వే సంస్థకు చెందిన ద్ఫ్సీసిల్ సంస్థ చైనా

కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసాయి.


You Might Also Like