మే 3వరకు లాక్‌డౌన్‌ పొడిగించడంతో ముంబై లో వలస కూలీలు ఆగ్రహం తో రోడ్డెక్కడం  తో పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదర గొట్టారు.రోజు రోజుకు క రోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువవుతుండటం తో తప్పని పరిస్థిల్లో మరో 19  రోజులు లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రధాని ప్రకటించడం తో తాము ఎలా బతకాలని నిరసన వ్యక్తం చేస్తూ ముంబయి మహానగరంలో వలస కూలీలు ఆందోళనకు దిగారు.బాంద్రా పశ్చిమ బస్టాండ్‌ వద్దకు  భారీగా తరలివచ్చిన కూలీలు తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేయారు . దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళన చేస్తున్న కూలీలను చెదరగొట్టారు. వలస కూలీలు వెళ్లాక అక్కడ శానిటైజేషన్‌ చేయించారు. సంఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి దోషులను అరెస్ట్ చేయాలనీ ముంబై పోలీసులు భావిస్తున్నారు.

You Might Also Like