కరోనా మహమ్మారిపై జరుపుతున్న పోరాటంలో భాగంగా దేశంలో విధించిన లాక్ డౌన్ ను పొడిగించేందుకే మెజారిటీ ముఖ్యమంత్రులు సుముఖత వ్యక్తంచేయగా  లాక్ డౌన్‌ని ఏప్రిల్ నెలాఖరు దాకా పొడిగించాలని నిర్ణయించిన ఫ్రధాని మోడీ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో అందుకు రంగం సిద్దం చేస్తుంది. రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి పై నెలకొన్న పరిస్థితులు, మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ పొడిగింపుపై అభిప్రాయాలే లక్ష్యంగా నేడు ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


మాస్క్‌ ధరించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సాధారణ మాస్క్‌ కాకుండా తెల్లటి వస్త్రంతో చేసిన మాస్క్‌ ధరించగా  పలువురు ముఖ్యమంత్రులు సైతం మాస్క్‌ ధరించి కాన్ఫరెన్స్ నే పాల్గోన్నారు.కరోనా పై పోరాటంలో భాగంగా తాను అనుక్షణం అందుబాటులో ఉంటానని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని హామీ ఇచ్చారు. ఎవరైనా, ఎప్పుడైనా తనకు ఫోన్‌ చేసి సలహాలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు.అందరు కలిసి పనిచేస్తేనే ఈ మహమ్మారిని తరిమికొట్టగలమని అన్నారు. తొలుత కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలో తాజా పరిస్థితులను సభ్యులకు వివరించింది. అనంతరం ఒక్కో ముఖ్యమంత్రి అభిప్రాయాల్ని ప్రధాని పంచుకున్నారు.చాలా మంది సీఎంలు లాక్‌డౌన్‌ పొడిగించాలని సూచించినట్లు సమాచారం. ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పంజాబ్‌ సీఎం అమరేందర్‌ సింగ్‌ లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావ్  అందరి కన్నా ముందే లాక్ డౌన్ పొడిగింపు ప్రతిపాదన చేయగా నేడు లాక్డౌన్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానికి సూచనలు చేశారు.


మరోవైపు కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బిహార్‌ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో దినసరి కూలీలకు మాత్రం మినహాయింపునివ్వాలని కోరింది. ఇప్పుడు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14తో ముగియనున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో గత 18 రోజులుగా దేశంలో లాక్ డౌన్ అమలు అవుతోంది. దాన్ని మరో రెండు వారాల పాటు పొడించాలన్న రాష్ట్రాలు, రాజకీయ పక్షాల సూచన మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాక్‌డౌన్ పొడింగించాలని నిర్ణయించారు. అయితే  వారు సూచించిన విధానంలో కాకుండాకొన్ని మార్పులు చేయాలని ప్రధాని భావిస్తున్నట్లు సమాచారం. దేశాన్ని మొత్తం మూడు జోన్లుగా విభజించి లాక్‌డౌన్‌ని పక్కాగా అమలు చేయాలని మోడీ హోంశాఖకు సూచించారు. దానికి అనుగుణంగా రెడ్, ఎల్లో, గ్రీన్ జోన్లుగా దేశాన్ని విభజించి జిల్లాల ప్రాతిపాధికన లాక్ డౌన్ సడలింపు చేపట్టేందుకు నిర్ణయించినట్టు తెలుస్తుంది.కాగా నేడు సమావేశంలో ముఖ్యమంత్రులు ఇచ్చినసలహలు సూచనలు పరిగణలోకి తీసుకుని రేపు ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి ఒక ప్రకటనచేసే అవకాశముంది.

You Might Also Like