తీగ లాగితే డొంక కదిలినట్టు ఒక కాంట్రాక్టర్ ను విచారిస్తే మావోయిస్టులకు సహకరిస్తున్న ఆరుగురి పేరు బయట పడింది.వివారాల్లోకి వెళితే మావోయిస్టులకు తన కారులో అత్యాధునిక   అంతర సమాచార వ్యవస్థకు సహాయపడే వాకీ టాకీ సెట్లు, బూట్లు, ఫ్యాబ్రిక్స్‌ లాంటి  సామగ్రిని తరలిస్తుండగా కాంట్రాక్టర్‌ తపస్‌ పాలిత్‌ను మార్చి 24న పోలీసులు అరెస్టు చేశారు. గత నెల రోజులుగా అతన్ని విచారించిన పోలీస్ లు విచారణ సందర్భంగా అతనిచ్చిన సమాచారంతో మరో ఆరుగురిని కాంకర్‌ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మావోయిస్టులకు గత రెండేండ్లుగా సహాయం చేస్తున్న ఏడుగురిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు కన్‌స్ట్రక్షన్‌ కాంట్రాక్టర్లు, నలుగురు కొరియర్లు ఉన్నారని బస్తర్‌ రేంజ్‌ ఐజీ పీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు. ఇందులో ల్యాండ్‌మార్క్‌ ఇంజినీర్‌ కంపెనీ, ల్యాండ్‌మార్క్‌ రాయల్‌ ఇంజినీర్‌ కంపెనీలను నడుపుతున్న నిషాంత్‌ జైన్‌, వరుణ్‌ జైన్‌ అనే కాంట్రాక్టర్లు ఉన్నారని వెల్లడించారు. వారి కంపెనీలు ప్రధానమంత్రి ఛత్తీస్‌గఢ్‌లోని అనంతరాగ్‌, అమబెడా, సిస్కోడ్‌, కోయలిబేడ వంటి మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో కాంట్రాక్టులు తీసుకొని రోడ్ల నిర్మాణం చేపాట్టాయి. ఈ ముగ్గురు కాంట్రాక్టర్లు మావోస్టులకు అవసరమైన వస్తువులను సరఫరా చేస్తున్నారని ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు.

You Might Also Like