సర్పంచ్ లు ప్రజలలోకరోనా వ్యాప్తి పై  అవగాహన కల్పిస్తూ ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టేలా చూడాలని దేశం లో  పంచాయతీ వ్యవస్థ బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు.పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచు‌లతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలపై సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణకు ఎనలేని కృషి చేస్తున్న సర్పంచులకు ధన్యవాదాలు తెలిపారు.

మెరుగైన సేవలు అందించి పురస్కారాలు పొందిన సర్పంచులకు అభినందనలు తెలిపారు. ఏటా మెరుగైన పనితీరు కనబర్చిన గ్రామపంచాయతీలకు పురస్కారాలు అందిస్తామని మోదీ ప్రకటించారు. కరోనా సంక్షోభ సమయంలో పేదలకు సరిపడా ఆహారధాన్యాలు అందించాలని సూచించారు. విద్యుత్‌, రహదారులు, పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీరాజ్‌శాఖ ఎంతో కృషి చేస్తోందన్నారు. కరోనాపై ప్రజలకు మరింత అవగాహన, చైతన్యం కలిగించాలని సూచించారు.

కరోనా వైరస్‌ ఎన్నో పాఠాలు నేర్పిందని మోదీ చెప్పారు. ఇప్పటి వరకూ లక్షా 25 వేల పంచాయతీల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తున్నట్లు  తెలిపారు.కరోనా మహమ్మారి మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఎప్పుడూ ఎదుర్కోని సవాళ్లను కరోనా వైరస్‌ దేశం ముందు ఉంచింది. కొత్త విషయాలు నేర్చుకునేలా చేసింది. కష్ట సమయంలో ఆత్మస్థైర్యంతో ఉండాలి. ఈ సమయంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టాలి. మనం వెళ్లే దారిలో అనేక ఆటంకాలు కలుగుతున్నాయి. కరోనాపై గ్రామ ప్రజలకు మరింత అవగాహన, చైతన్యం కలిగించాలి’’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఈ-గ్రామస్వరాజ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ను  ప్రధాని ప్రారంభించారు.

You Might Also Like