కరోనా నేపత్యం లో మాస్కులు ధరించడం తప్పనిసరి కానుండగా భారత ప్రధాని మోడీ మాస్క్ ధరించి సమావేశాలకు హాజరై అందరిని ఆశ్చర్య పరిచారు. లాక్క డౌన్ ఎత్తివేత , కరోనా  వైరస్ అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు , దేశంలో నెలకొన్న పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మోదీ హోమ్‌మేడ్ ఫేస్ మాస్కు దరించారు. తెల్లరంగు మాస్కును మోదీ తన ముఖానికి  కట్టుకోగా  పలువురు ముఖ్యమంత్రులు కూడా మాస్కులు ధరించడం గమనార్హం. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే సర్జికల్ మాస్కు ధరించగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఆ రాష్ట్ర అధికారులు కూడా ముఖానికి మాస్కులతో కనిపించారు.మొత్తానికి కరోనా నేపత్యం లో మాస్క్ ల ప్రాధాన్యత పెరిగింది.You Might Also Like