చైనా ప్రభుత్వం మరోసారి తన వక్ర బుద్ధి చాటుకుంది.భారత్ పై బుకాయింపులకు దిగింది.ఓవైపు సైనిక 

దౌత్య పరమైన చేర్చలు చేస్తూనే మరోవైపు తప్పంతా భారత్ దే అని మొండిగా వాదిస్తోంది.గాల్వాన్ లోయలో 

మొదట భారత సైనికులే తమను కవ్వించారని చెప్పుకొస్తోంది.లడక్ సమీపంలోని గాల్వాన్ లోయలో 

భారత్చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు 

అమరులయ్యారు రెట్టింపు సంఖ్యలో చైనా సైనికులు హతమయ్యారని నిఘా వర్గాల సమాచారం 

సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలను తగ్గించేందుకు ఇరుదేశాలు సైనిక దౌత్య స్థాయిలో చేర్చలు 

జరుపుతున్నాయి.ఇక వెనక్కి తగ్గేందుకు రెండు దేశాలు అంగీకరించాయని ఓవైపుచెప్తున్నా చైనా 

అసలు ఈ ఘర్షణకు భారత జవనులే కారణమని చెప్పుకొచ్చింది.ఒకవైపు రెండుదేశాలమధ్య చేర్చలు

జరుగుతుండగానే చైనా ఉద్రిక్త ప్రాంతాలలో పనులు కొనసాగించింది.తాజాగా విడుదలైన సాటిలైట్ 

చిత్రాల్లో గాల్వాన్ లోయ వద్ద వాస్తవాధీన రేఖకు రెండు వైపులా చైనా పలు రక్షణాత్మక నిర్మాణాలు చేపట్టినట్టు

వెల్లడైంది.భారత్ చైనా మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్న పెట్రోల్ పాయింట్ 14 వద్ద చైనా సైనికులకు

వసతి గృహాలు గాల్వాన్ నదిపై కల్వర్ట్ చేపట్టినట్టు తెలుస్తోంది జూన్ 22 కు సంబందించిన ఈ చిత్రాలను

మక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసింది.ఈ చిత్రాల ప్రకారం మే 22 న ఒకటే టెంట్ ఉండగా తాజాగా

వెలువడిన చిత్రాలు చైనా రక్షణాత్మక నిర్మాణాలను చూపిస్తున్నాయి.

You Might Also Like