మరిన్ని ఆసక్తికరమైన వార్తలకు ఇక్కడే దీనిపైనే క్లిక్ చేయండి ధన్యవాదాలు

జమ్మూకశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, సైనిక బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.జిల్లా లోని మల్‌హురా జాన్‌పొరా గ్రామంలో ఉగ్రవాదులున్నారని అందిన సమాచారం మేరకు మంగళవారం అర్దరాత్రి జమ్మూకశ్మీర్ పోలీసులు సాయుధ బలగాల జవాన్లతో కలిసి గాలింపు చేపట్టారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారని కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని బుధవారం ఉదయం మిలిటరీ ప్రతినిధులు  ప్రకటించారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్లారని వారికోసం గాలిస్తున్నామని వారు చెప్పారు. 

You Might Also Like