జన్మనిచ్చిన తండ్రి చివరి క్షణాల్లో బాదపడుండగా  ఆయనతో  గడపాలనుకున్నప్పటికీ రాష్ట్రంలోని 23 కోట్ల మంది ప్రజలను రక్షించాల్సిన బాధ్యత తనపై ఉందనే బాధ్యత తో ఆ పని చేయలేకపోయానని అలాగే ప్రస్తుత పరిస్థితిల్లో అయన అంత్య క్రియలకు కూడా హాజరు కావడం లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించి బంధం కంటే బాధ్యత గొప్పదని నిరూపించారు  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ (89)  సోమవారం మృతి చెందారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.తండ్రి మృతిపై  యోగి ఆదిత్యానాథ్  విచారం  వ్యక్తం చేశారు. మంగళవారం  నిర్వహించనున్న తన తండ్రి అంతిమసంస్కారాలకు ఆయన హాజరు కాలేకపోతున్నానని, ‘కరోనా’ కట్టడికి చేస్తున్న పోరాటం నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

తన తండ్రి మరణవార్త విని చాలా బాధపడ్డానని అన్నారు. నమ్మకంగా ఉండడం, కష్టపడడం, నిస్వార్థంగా ఉండటం గురించి తన తండ్రి తనకు ఎప్పుడూ చెబుతుండేవారని గుర్తుచేసుకున్నారు.ఉత్తరాఖండ్ లోని పౌరి జిల్లాలోని స్వగ్రామానికి ఆనంద్ సింగ్ బిష్ట్ ను భౌతిక కాయాన్ని తరలించనున్నారు. రేపు తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకానున్న తన తల్లి బంధువులు లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని కోరారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత తాను అక్కడికి వెళతానని చెప్పారు.యోగి తండ్రి మృతిపై పలువురు రాజకీయప్రముఖులు  సంతాపం తెలిపారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులు ఉన్నారు.యూపీ హోం శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ అవానిష్ అవస్థి కూడా ఓ ప్రకటనలో తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.కాగా బంధం కంటే బాధ్యత గొప్పదని నిరూపించారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్ దాస్ అబినందనీయుడే.

You Might Also Like