మెల్ల మెల్ల గా భారత్ లో లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇందులో భాగం గా ప్రముఖ పుణ్ణ్యక్షేత్రాలు కేదార్ నాథ్, బదరీ నాథ్ ఆలయాలను ఈ నెలలో తెరిచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.ఈ మేరకు  ఈ నెల 29వ తేదీన కేదార్ నాథ్ ఆలయాన్ని, 30న బదరీనాథ్ ఆలయాన్ని తెరవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కేదార్ నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు తన స్వస్థలమైన మహారాష్ట్రలో, బదరీ నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు స్వంత రాష్ట్రమైన  కేరళలో ఉన్నారు.


దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో  ఆయా ఆలయాల ప్రధాన అర్చకులను రప్పించే నిమిత్తం  ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఉత్పల్ కుమార్ సింగ్ కేంద్ర హోం శాఖకు ఓ లేఖ రాశారు. ఆ అర్చకులను రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.కరోనా పోవడం వారు రావడం తరువాయి మొదట దేవుడి గుళ్ళు ఆ తరువాత బళ్ళు తెరుచుకుని ప్రజలంతా పాత రోజుల్లోలా సంతోషం గా ఉండాలనిఆ భగవంతుళ్ళను కోరుకుందాం.

You Might Also Like