ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాధి వ్యాపిస్తేనే కాదు అది అంటుకుంటుందన్న భయం తో కూడా పరంపర స్పర దాడులు తొక్కిసలాటలు జరిగి ప్రజలు మృతి చెందుతున్నారు.జైలులో ప‌రిశుభ్ర‌త స‌రిగా లేదని క‌రోనా వైర‌స్ సోకింద‌న్న వ‌దంత‌లు చేలరేగడం తో  కొలంబియాలోని ఓ జైలులో అల్ల‌ర్లు చోటుచేసుకున్నాయి. దీంతో ఆ జైలులో ఉంటున్న 23 మంది ఖైదీలు చ‌నిపోయారు. కొలంబియా రాజ‌ధాని బొగొటాలో కిక్కిరిసిపోయిన ఓ జైలులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న‌తో ఆ ప్రాంతంలో వైర‌స్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. బ‌య‌ట‌కు పారిపోవాల‌నుకున్న ఖైదీలు హింస‌కు దిగిన‌ట్లు ఓ మంత్రి తెలిపారు. జైలులో ప‌రిశుభ్ర‌త స‌రిగా లేద‌న్న వాద‌న‌ల‌ను ఆయ‌న కొట్టిపారేశారు. మ‌రో లాటిన్ దేశం చిలీలో వైర‌స్ క‌ర్ఫ్యూ విధించారు. రాత్రి ప‌ది నుంచి తెల్ల‌వారుజామున 5 గంట‌ల వ‌ర‌కు ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్దు అని ఆదేశాలు జారీ చేశారు.


You Might Also Like