భారి ఎత్తున కట్నం తీసుకుని రెండో పెళ్లి చేసుకోవాలన్న దుర్బుద్దితో తన భార్యను పాము కాటు తో చంపించాడు ఓ ప్రబుద్దుడు. యూట్యూబ్లో పాముల ద్వారా ఎలా మ‌నుషుల‌ను చంపొచ్చో తెలుసుకొని పక్కా ప్లాన్ ప్రకారం భార్య మ‌ర్డ‌ర్ కు పథకం పన్నాడు.కేరళ కొల్లాంలో పాము కాటు స్కెచ్ తో భార్యను హత్య చేసిన ఉదంతం సంచలనం సృష్టించింది.కేవలం డబ్బు కోసమే ఈ హత్య చేయడానికి సూరజ్ ఈ ప్లాన్  చేసినట్లు విచారణ లో పోలీస్ లు తేల్చారు..మొదటి సారి తన భార్యను చంపడానికి ఈ  ఏడాది ఫిబ్రవరి లో ప్లాన్ చేసి రక్త పెంజర పాము ను తన స్నేహితుడు సురేష్ ద్వారా కొనుగోలు చేసి దానితో  ఆమెను కరిపించాడు.

అయితే ఆమె అదృష్టవశాత్తు రెండు నెలల చికిత్స అనంతరం  బతికి బయట పడగా సూరజ్ఈ మల్లి ఆమెను చంపడానికి యత్నించాడు.ఆమె పుట్టింటి నుండి తిరిగి తాగానే  మే 6 వ తేదీన మల్లి ఈ సారి తన భార్య  పాత్రో బతక వద్దనే ఆలోచనతో భయంకరమైన కాలనాగు ను సురేష్ తో కొనుగోలు చేయించి ఆ పామును రాత్రి ఆమె బెడ్ లో ఉంచి పక్కనే కూర్చుంది రెండు సార్లు పాము  తో భార్యను కాటు వేసేలా  చేసాడు.దీనితో మర్నాడు భార్య మృతి చెందింది.మొదట పాము కాటు మరణం అనుకున్న సూరజ్ ప్రవర్తనలో తేడా కనబడటం రెండు సార్లు పాములు బెడ్ రూమ్ లో ఎలా వచ్చాయనే అనుమానం తో  పాత్రో తల్లి దండ్రులు ,బంధువులు పోలీసులకు పిర్యాదు చేశారు.దీనితో     ఈ కేసు ద‌ర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు. మ‌ర్డ‌ర్ కోసం ఉపయోగించిన పాత్రో శవాన్ని ,పామును బ‌య‌ట‌కు తీసి శవపరీక్ష చేశారు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది నిందితుడి ఇంటికి వెళ్లి పాము కళేబరాన్ని పాతిపెట్టిన ప్లేస్ గుర్తించి జాగ్రత్తగా తవ్వి బయటకు తీశారు.


పాము కాటు వల్లే ఉత్రా ప్రాణాలు విడిచింద‌నే విషయం శవపరీక్షల్లో వెల్ల‌డైంద‌ని అధికారులు వెల్లడించారు. దాదాపు 152 సెంటిమీట‌ర్ల‌ పొడవైన పాము ఇప్పటికే కుళ్లిపోయే ద‌శ‌లో ఉంద‌ని, అయితే శవపరీక్షకు అవసరమైన శాంపిల్స్ తీసుకోగలిగినట్లు పేర్కొన్నారు. పాము కోరలను సైతం నమూనాల కోసం తీసుకున్నట్లు వెల్ల‌డించారు. ఫోరెన్సిక్ టీమ్ సేకరించిన శాంపిల్స్ తదుపరి టెస్టుల‌ కోసం పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. తుది ఫలితాలను కోర్టుకు సమర్పించనున్నట్లు వివ‌రించారు. హత్య కేసులో ఇంకెవరి పాత్ర అయినా ఉందా? అనే విషయంపై విచార‌ణ చేస్తున్న‌ట్టు వెల్లడించారు.

హత్యకు ఉపయోగించిన పామును ఓ కంటైనర్లో దాచి సురాజ్ ఇంటి పెరట్లో పాతిపెట్టాడు.కాగా పాత్రో కూడా పెద్ద ఎత్తున కట్నం ఇచ్చి సూరజ్ ను పెళ్లి చేసుకోగా మల్లి పెళ్లి చేసుకుని కొత్త భార్య తో ఆమె ఇచ్చే కట్నం తో సుఖంగా బతకాలనే దురాశ తోనేఈ ఘాతుకానికి పాల్పడగా సూరజ్ అతడి మిత్రుడు సురేషులను నిన్న అరెస్ట్ చేసి పోలీసులు కటకటాల్లోకి నెట్టడం కొసమెరుపు.

You Might Also Like