లాక్ డౌన్ తో మద్యం దొరకక  విసిగి వేసారి డీలా పడ్డ మందుబాబులు మద్యం దొరకడం తో నూతన ఉత్సహం  తో ఉరకలు వేస్తున్నారు.సోమవారం నుంచి మద్యం షాపులు తెరుచుకోవడంతో మందుబాబుల మద్యం తో  గొంతు తడుపుకుంటూ మత్తులో ఎం హేస్తున్నారో తెలియని స్థితి కి వెళ్లి పోతున్నారు. కర్ణాటకలోని కోలారులో మద్యం అమ్మకాలు మొదలవడం తో మందు పీకలదాకా తాగిన ఓ మందుబాబు మద్యం మత్తులో తన బైక్ కు అడ్డుగా వచ్చిన విష సర్పాన్ని చేత్తో పట్టుకొని దాన్ని కొరికి కొరికి చంపి తినేశాడు. మద్యం మత్తులో మందు బాబు చేసిన పనిని చూసి అక్కడి వారంతా షాక్ అయ్యాడు. పామును చూస్తేనే హడలిపోయే జనం, మద్యం తలకెక్కగానే ఆ మత్తులో  చికెన్ ముక్కన్నట్లు గా పాము తలను కరకర నమిలేశాడు.  ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. నిర్మాణరంగంలో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించే కుమార్ అనే వ్యక్తి మంగళవారం రోజున కావాల్సినన్ని మద్యం బాటిళ్లు కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నాడు. అనంతరంఫుల్లుగా తాగిన  కుమార్ బైక్ పై వెళ్తుండగా ఓ పాము అతని బైక్ కు అడ్డుగా వెళ్ళింది.అప్పటికే మత్తు తలకెక్కిన కుమార్, ఆ పామును పట్టుకొని కొరికి చంపేశాడు. దీంతో ఆ పాము అక్కడికక్కడే చనిపోయింది. పామును నోటితో కొరికి చంపేసినా తనకు ఏమి కాలేదని కుమార్ చెపుతూ దాన్ని మేడలో వేసుకుని మందు తాగుతూ తిరగడం మద్యం మత్తు ఎలాంటిదో తెలియ జేస్తుండగా మత్తు దిగాకా తెలుస్తుంది య్యకు అంటూ కామెంట్ చేస్తున్నారు జనం.

You Might Also Like