క‌రోనా క‌ట్ట‌డి కోసం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించ‌డంతో నిత్య‌వ‌స‌ర వ‌స్తువులే అతి కష్టం గా దొరుకుతుంటే మందు బాబులు మద్యం దొరకక అల్లాడి పోతున్నాడు.మందు దొరకడం లేదు దొరికిన బ్లాక్ లో తాము కొనే స్థితిలో లేని మందు బాబులు ఇంట్లోనే మందు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారట.ఈ విషయం పై అటు గూగుల్  తల్లిని  ఇటు యూట్యూబ్  మామను పదే పదే అడుగుతూ తెగ విసిగిస్తున్నారట పాపమ్.

దేశ వ్యాప్తం గా మద్యం దుకాణాలు బంద్ చేసి ఉండ‌డంతో ఏదో ఒక ర‌కంగా మందు చుక్కతో గొంతు త‌డుపుకోవాల‌న్న త‌ప‌న‌తో కొంద‌రు బ్లాక్ లో దొరుకుతుందేమోన‌ని ప్ర‌య‌త్నాల్లో ప‌డ్డారు. లాక్ డౌన్ అమ‌లులో ఉన్నాఒక్క తెలంగాణ‌లోనే కాదు దేశ‌మంతా అనేక ప్రాంతాల్లో మొన్నటి వరకు లిక్క‌ర్ షాపు య‌జ‌మానులు అమ్మ‌కాలు చేశారు.మద్యం దొరికాక వాటి ధరలు అమాంతం పెంచడం తో అంత ధర పెట్టలేక కొని తాగలేకా అనేక అవస్థలుపడుతున్నారు మందు బాబులు.కొందరైతే  మందు షాపులకు కన్నాలు వేశారు కూడా . ప్ర‌భుత్వాలు నిఘా పెంచడం మద్యం దొరకక పోవడం తో కొంత మంది ఇంట్లోనే మందు త‌యారు చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ప‌డ్డారు. దీని కోసం గూగుల్ లో వెత‌క‌డం స్టార్ట్ చేశారు.దీంతో ఒక్క‌సారిగా ఇంట్లో మద్యం తయారు చేయడం ఎలా అంటూ సెర్చ్ చేయగా సెర్చ్ ఇంజిన్కు వాళ్ళు ఎం కొడతారో ముందే తెలిసి పోయి  ఆ పదం కొట్టక ముందే సూపెడుతుంది. లాక్ డౌన్ పెట్టిన తొలి వారంలోనే మార్చి 22 నుంచి 28 మ‌ధ్య ఈ సెర్చ్ పీక్ లోకి వెళ్లింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 15 మ‌ధ్య గూగుల్ ట్రెండ్స్ లో ఈ సెర్చ్ లో మ‌ణిపూర్ తొలి స్థానంలో ఉంది. ఆ త‌ర్వాత జ‌మ్ము క‌శ్మీర్, ఉత్త‌రాఖండ్, జార్ఖండ్, అస్సాం ఉన్నాయి. ఆరో స్థానంలో ఏపీ, ప‌దో స్థానంలో తెలంగాణ ఉన్నాయి.ఆల్క‌హాల్ త‌యారీ కోసం సెర్చ్ చేసిన‌ట్లుగానే యూత్ పోరా గాళ్ళు  బీర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాల‌న్న దాని కోసం విప‌రీతంగా సెర్చ్ చేశారు. ఇంట్లో బీర్ తయారు చేయడం ఎలా అంటూ తెగ సెర్చ్ చేశారు. టాప్ -5 సెర్చ్ లో ఢిల్లీ, కేర‌ళ‌, హ‌ర్యానా, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌ లు ఉన్నాయి. ఆరో స్థానంలో తెలంగాణ, ఏడ‌వ స్థానాల్లోత‌మిళ‌నాడు, ఎనిమిదో ప్లేస్ లో ఏపీ, తొమ్మ‌ది, ప‌ది స్థానాల్లో రాజ‌స్థాన్, ప‌శ్చిమ బెంగాల్ ఉన్నాయి.తయారు చేశారో లేదో తెలియదు కానీ వెతుకుడై తే  రికాం లేకుండా వెతికి వెతికి చేతులు నొప్పి పుట్టేదాకా వెతికినట్టున్నారు .ఆమ్మో మల్ల  చేతులు నొప్పి పుడితే మందు తాగితే తక్కువతదని మందు కోసం  తిరుగుతారామోనని భయపడుతున్నారు వారి కుటుంబ సభ్యులు .

You Might Also Like