ధూల్‌పేట్‌ లో ఘనం గా నిర్వహించిన నిశ్చితార్థం వేడుకలు కొంపముంచాయి.కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతీ ఒక్కరు భౌతికదూరం పాటించాలని ,వేడుకలు వద్దని  ప్రభుత్వం వారిస్తున్నాహెచ్చరిస్తున్న వినకుండా కొందరు చేస్తున్న పనులు వారి ప్రాణాల మీదికే తెస్తున్నాయి. లాక్‌డౌన్ నిబంధనల్లో ఎక్కువ మంది ఒకే దగ్గర గుమ్మిగూడే కార్యక్రమాలకు అనుమతిలేకున్న పెళ్లికే 20 మందికి అనుమతి ఉన్న పెడా చెవిన బెట్టి  మే 11న హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీలోని ధూల్‌పేట్‌లో ఓ నిశ్చితార్థం ధూంధాంగా నిర్వహించారు.

దీనితో   పలువురికి కరోనా సోకినట్లు ప్రభుత్వాధికారులు ఆలస్యంగా గుర్తించి రంగం లోకి దిగారు.ఈ కార్యక్రమానికి దాదాపు 333 మంది వరకు బంధువులు, స్నేహితులు హాజరైనట్టుగా ఇందులో ఎవరికో కరోనా వ్యాధి సోకి ఉండటం తో తద్వారా వైరస్ పలువురికి అంటుకున్నట్లు .కొద్ది రోజుల తర్వాతే తెలిసింది..కరోనాబారిన పడి పెళ్లి కుమారుడి తండ్రి అస్వస్థతకు గురయ్యాడు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇక, ఆ కుటుంబానికి, కొందరు బంధువులకు కరోనా టెస్ట్‌లు చేయగా.15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది అయితే ఎవరి ద్వారా కరోనా సోకిందనే అంతుపట్టడంలేదు.


దీంతో నిశ్చితార్థ వేడుకకు హాజరైన వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారట అధికారులు. వాళ్లకు సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్‌లపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు నిశ్చితార్థం తర్వాత పెళ్లి జరగాల్సిన ఆ కుటుంబం  ఇంట్లో 58 ఏళ్ల ఇంటి పెద్దను కోల్పోయి విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికైనా ప్రజలు వైరస్ వ్యాప్తి చెందకుండా వేడుకలకు కొద్దీ మందినే పిలవాలని లేకుంటే ఈ వైరస్ వ్యాప్తి చెంది బారి ప్రమాదం జరిగే అవకాశముందని   తెలుపుతున్నారు  

You Might Also Like