పిర్యాదు చేయడానికి వచ్చిన ఘాజిపూర్కు చెందిన యువతిని  ఐ.ఎ.ఎస్అధికారి  సంజయ్ ఖాత్రి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే   వార్తలు చిలువలుపలువలుగా వచ్చాయి.సమస్య తో  ఫిర్యాదు తీసుకువచ్చిన యువతిని  ఆ అధికారి వివాహం చేసుకున్నాడు. ఖాజీపూర్ జిల్లాకు చెందిన డిఎమ్‌గా ఉన్నప్పుడు ఆ యువతీ  తన సమస్యతో సంజయ్‌ను మళ్లీ మళ్లీ కలిసేది. క్రమంగా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారు, తరువాత వారు వివాహం చేసుకున్నారు. ఇలా ఆ జిల్లా లో  పుకార్లు చేలా రేగగా  ఈ వివాహం వెనుక ఉన్న నిజం, అసలు విషయం ఏంటంటే  ఘాజిపూర్ జిల్లాలోని చిట్నాథ్ జెరె కోటలో నివసిస్తున్న విజయలక్ష్మి, రాయ్ బరేలీకి చెందిన ప్రస్తుత డిఎం రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన సంజయ్ ఖాత్రి   గత నవంబర్ 19 న వివాహం చేసుకున్నారు. విజయ్ లక్ష్మి తండ్రి రాంజీ వర్మ కన్నుమూశారు. అతనికి ముగ్గురు సోదరులు మరియుఇద్దరు అక్కలు ఉన్నారు.

ఇంటర్ తరువాత ఆమె ఉన్నత చదువుల కోసం ఢిల్లీకి  వెళ్లింది.ఆమె  ఐఎఎస్ కోసం సిద్ధమవుతుండగా సంజయ్ ఖాత్రిని అక్కడే కలిశారు. ఇద్దరూ స్నేహితులు అయ్యారని కాగా తమ సోదరి ఐఎఎస్ పరీక్ష లో  విఫలమై  తిరిగి ఘాజిపూర్ వచ్చిందని ఆ పరిచయం తోనే ఖాత్రిని కలిసేదని దీనితో   తన సోదరితో డిఎమ్ వివాహం ప్రేమ వివాహం అని పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని ఆమె సోదరుడు  రంజిత్ తెలిపారు.అసలు విషయం ఏమిటంటే ఇరుపక్షాల కుటుంబాల సమ్మతితోనే వారి వివాహం ఏర్పాటు చేయబడింది. 

అంతకు ముందు ఆమె వివాహం కోసం చాలాకాలంగా సంబంధాలు చూశామని  కానీ ఆమె ఎవరిని ఇష్టపడలేదు. ఇంతలో, సంజయ్ ఖాత్రి ఖాజీపూర్ డిఎంగా వచ్చారు.వీరురువురు ఒకరికొకరు తెలిసి ఉండటం తో పెళ్ళికి ఒప్పుకుని  ఇద్దరూ ఘజియాబాద్‌లో అందరి అంగీకారంతో వివాహం చేసుకున్నారు. 

You Might Also Like