రాత్రివేళ దయ్యాలు సంచరిస్తుండటంతో  ఇళ్లల్లోంచి బయటకు రావాలంటే భయపడిపోతు న్నారు ఇండోనేసియాలోని జావా ద్వీపం కేపూ గ్రామ వాసులు.కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆ గ్రామం లో దెయ్యాలు, భూతాలు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాయి. రాత్రుళ్లు బయట తిరుగుతున్నా వారిపైకి దూకి బెంబేలెత్తి స్తున్నాయి. వాస్తవానికి దెయ్యాల వేషంలో సంచరిస్తున్న వారు తోటి మనుషులే. గ్రామపెద్దలు కొందరు వ్యక్తులకు తెల్లటి దుస్తులు తొడిగి వారిని పలు ప్రాంతాల్లో మోహరి స్తున్నారు.

ఈ గ్రామంలో దయ్యాల పట్ల గ్రామస్థులకు మూఢనమ్మకాలు ఎక్కువ. దీంతో గ్రామపెద్దలు గ్రామ స్థుల భయాన్ని కరోనా కట్టడికి వినియోగించు కోవాలని తలచారు. పోలీసుల సాయంతో దయ్యాల ప్లాన్‌కు తెర తీశారు. లాక్‌డౌన్‌ పకడ్బం దీగా అమలు చేసేందుకు వ్యూహం రచించారు. కరోనా వైరస్‌ నుంచి ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు పక్కా వ్యూహాన్ని సమర్థంగా అమలు చేస్తున్నారు. ఇండోనేసియాలో పోకోంగ్‌ అంటే దయ్యం అని అర్థం. ఇండోనేసియా జాన పద కథల్లో పోకోంగ్‌లను భీకర ఆకారాలుగా వర్ణిస్తుం టారు. సహజంగానే ఇండోనేసియా పౌరులకు పోకోంగ్‌ అంటే వీపరీతంగా భయపడిపోతారు.

పోకోంగ్‌ లు తెల్లటి ముసుగులతో చుట్టి ఉంటాయి. జనసంచారం లేకపోవ డంతో పోకోంగ్‌లు గ్రామంలో సంచరిస్తున్నాయని గ్రామస్థులు వ్యాఖ్యానిస్తున్నారు. సాయంత్రవేళల్లో జరిగే ప్రార్థనలకు కూడా ఎవరూ వెళ్లడం లేదని తెలిపారు. పెద్ద లే భయపడుతుండటంతో పిల్లలు కూడా గడప దాటడం లేదు. గ్రామస్థులు సామాజిక దూరీకరణను పాటించేం దుకు పోలీసుల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహి స్తున్నట్టు గ్రామ యువజన సంఘం చీఫ్‌ అంజార్‌ తెలిపా రు. ప్రసుత్తం ఇండోనేసి యాలో 4,241 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా 373మంది మరణించా రు. ఇండోనేసియా విశ్వవిద్యాలయ పరిశోధకుల వివరాలప్రకారం మే చివరినాటికి 1,40,000 మరణాలు, 1.5మిలియన్‌ కేసులు నమోదవుతాయని అంచనా ఈ నేపత్యం లో పొకోంగ్ లతో ప్రజలు బయటకు రాకుండా చేస్తున్న ఆ గ్రామా ప్రజల కృషి ప్రశంసనీయం.

You Might Also Like