లాక్‌డౌన్‌ తో అందరు సతమతమవుతుంటే సందట్లో సడేమియా లా  ఒక‌ ప్రేమజంట జంప్ అయ్యేందుకు సిద్దపడింది.యూపీలోని ఆగ్రా లో ఇంట్లోనుంచి పారిపోయి మహారాష్ట్రలోని నాసిక్ వెళ్ళడానికి రహస్యంగా బయలుదేరి ‌ గూడ్స్ రైలులో నక్కి ఒక మూలాన కూర్చోగా ఆ రైల్  రాజస్థాన్‌ చేరుకుంది. అప్ప‌టివ‌ర‌కూ గూడ్స్ రైలులో ప్రేమికుల జంట దాక్కున్న విష‌యం బ‌య‌ట‌ప‌డ‌లేదు‌.  అయితే  ఢిల్లీ-ముంబై రైల్వే లైన్‌లోని హిందౌన్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక క్రాసింగ్ వద్ద క్యారేజ్ కంపార్ట్‌మెంట్‌లో కూర్చున్న‌ ప్రేమికుల జంటను  గేట్‌మ్యాన్‌ గుర్తించాడు.. వెంట‌నే అత‌ను హిందౌన్‌ సిటీ రైల్వే స్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇచ్చాడు.

స్టేషన్ మాస్టర్ గూడ్స్ రైలును ఆపి జీఆర్పీ సిబ్బంది సహాయంతో ప్రేమికుల జంటను గూడ్స్ రైలులో నుంచి దించారు. త‌రువాత గంగాపూర్ సిటీ జీఆర్పీ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి ఆ ప్రేమికుల జంటను గంగాపూర్ నగరానికి తీసుకువచ్చారు. వారు ఆ జంట‌ను ప్రశ్నించగా వారిద్ద‌రూ యూపీలోని బర్నాల్ ప్రహ్లాద్పూర్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని మెయిన్‌పురిలో నివసిస్తున్నారని తెలిసింది.అయితే అప్ప‌టికే ఆ జంట‌లోని యువ‌తి అదృశ్య‌మైన‌ట్లు పోలీస్‌స్టేషన్‌లో ఆ అమ్మాయి తల్లి దండ్రులు పిర్యాదు మేరకు కేసు న‌మోద‌య్యింది. ఆ ప్రేమికుల జంట త‌ల్లిండ్రుల‌ను ఇక్క‌డికి ర‌ప్పించి, వారికి ఈ జంటను అప్పగిస్తామని జీఆర్పీ పోలీస్ అధికారి లక్ష్మణ్ సింగ్ చెప్పారు.మొత్తానికి జంప్ జిలానీలు అడ్డం గా బుక్ అయ్యారు.

You Might Also Like