లా క్డౌన్ సమయం లో బయట తిరుగొద్దని ప్రభుత్వ నియమాలను కచ్చితం గా అమలు చేస్తున్న పోలీసులపైనే అందరు ద్రుష్టి పెట్టి శత్రువులుగా చూస్తూ వారిని తిడుతూ దాడులు చేస్తూ నానా రభస చేస్తున్నారు.అలంటి ఘటన ఒకటి స్పెయిన్ లో జరిగింది  తనను అరెస్ట్ చేశారనే అక్కసుతో నగ్నం గా పోలీస్ కారు ఎక్కి వారికే వేలుచూపుతు నృత్యం చేసి వారిని అవమాన పరిచిన ఈ సంగత వివారాలు చూద్దాం.

కోవిద్ -19 తో గజగజ లాడుతున్న స్పెయిన్  లో ప్రభుత్వం కట్టు దిట్టమైన ఏర్పాట్లతో జనాన్ని బయటకు తిరగనివ్వడం లేదు.ప్రభుత్వం అక్కడ లాక్‌డౌన్ ఖచ్చితంగా అమలు చేస్తూఅనవసరం గా బయట తిరిగేవారిని నేరుగా అరెస్ట్ చేసి  కోర్టుముందు నిలబెడుతుంది. లాక్‌డౌన్ ఉల్లంఘనకు పాల్పడటమే కాకుండా చుట్టుపక్కల ప్రజలను విసిగిస్తోందనే కారణంతో టర్రెమొలినాస్‌లోని కోస్తా డెల్ సాల్ రిసార్ట్‌లో నివసిస్తున్న 41 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

వెంటనే పోలీసులు ఆమెను కోర్టుకు ముందు హాజరు పరిచారు.అరెస్ట్ సమయం లో పోలీస్ లతో వాగ్విదానానికి  దిగిన ఆమె కు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె సంతోషం పట్టలేక బయటకు పరుగెత్తుకు వచ్చి సంతోషం తో నృత్యం చేయడం మొదలు పెట్టింది.తనను అరెస్ట్ చేసిన పోలీసులను తిడుతూ  ‘‘నన్నే అరెస్టు చేస్తారా??’’ అంటూ పోలీస్ కారు పైకెక్కిఆమె దుస్తులన్నీ విప్పేసి, మధ్య వేలు చూపిస్తూ లా క్‌డౌన్‌పై నిరసన వ్యక్తం చేస్తూ డాన్స్  ఆడటం మొదలు పెట్టడం తో పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది.

దీంతో పోలీసులు ఆమెను లాఠీ కాళ్లపై కొట్టి కిందికి దించారు. అనంతరం అంబులెన్సులోకి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ అతిక్రమించిందనే ఛార్జ్ షీట్ తో పోలీసులు ఆమెను మల్లి కోర్ట్ ముందుకు హాజరు పరిచే అవకాశముందని ,ఇప్పటికే  కోర్టు ఆమెకు ఇచ్చిన  బెయిల్‌ను రద్దు చేసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. ఆమె పోలీస్ లను గేలి చేస్తూ డాన్స్ చేయడం  కొందరు  వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.

You Might Also Like