భార్య కూతురు మృతి చెందినప్పటికీ  కడసారి చూపులకు నోచుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తూ  వీడియో కాల్‌ ద్వారా భార్యాకూతురి అంత్యక్రియలు చూస్తున్న  ఓ వక్తి దుస్థితి చూసి కన్నీటిపర్యంతమవుతున్నారు . ఉపాధి నిమిత్తం విదేశానికి వెళ్లిన ఒక వ్యక్తి లాక్ డౌన్ తో అక్కడే చిక్కుకు పోగా అయన భార్య కూతురు ఒక ప్రమాదం లో మృతి చెందడం, వారి మ్రుత దేహాలను వీడియో కాల్ లోనే చూస్తు అంత్యక్రియలు నిర్వహించిన ఘటన‌  పలువురిని కలిచివేసింది. ఈ సంఘటన సామాజిక మద్యంలో వైరల్ అవుతూ పలువురిని కన్నీళ్లు పెట్టిస్తుంది. వివారాల్లోకి వెళితే   లక్షెట్టిపేటకు చెందిన పోతరాజుల శ్రీనివాస్‌ భాగా సంపాధించి తన భార్యభిడ్డలు ఉన్నతంగా సాకాలని డబ్బు సంపాధనకై ఉపాధి నిమిత్తం విదేశానికి వెళ్లాడు.

అతని భార్య సుజాత(40), కావ్య(18)బెల్లంపల్లి మండలం పెర్కపల్లిలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వారి బంధువు బాకం కొమురయ్య(48) ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. వారిని గుర్తు తెలియని వాహనం ఢకొీట్టడంతో ముగ్గురు మృతిచెందారు. మృతుడు కొమురయ్య సింగరేణిలోని సెక్యూరిటీ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగి. కాగా సుజాతకు భర్త శ్రీనివాస్‌, ఇద్దరు కుమార్తెలుండగా పెద్ద కుమార్తె కావ్య, తను మృతిచెందారు. తన ఇద్దరి పిల్ల పెళ్లి ఘనం గా చేయాలనే వారికి దూరంగా విదేశాల్లో పనిచేస్తున్నానని ఇప్పుడు తానూ వారి చివరి చూపుకు లేక అంత్యక్రియలు చేయలేక బటీహాకడం ఎందుకని రోదించిన తీరు అందరిని కలిచివేసింది.మృతదేహాలకు అంత్యక్రియల కార్య క్రమాలను వీడియో కాల్ లో చూస్తూ తీవ్రం గా రోదిస్తూ వేదన పడుతున్న శ్రీనివాస్ పరిస్థితి పై పలువురు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

You Might Also Like