ప్రార్థన స్థలమే ప్రాణంతాకమైన వ్యాధి సంక్రమణకు కారణమైంది.ప్రార్థించిన చోటే ప్రాణాలు తీసే వ్యాధిని అంటకట్టుకొచ్చామని తెలియని అభాగ్యులు తమ తమ స్వస్థాలకు తిరిగొచ్చి తమతో పాటు వేలాది మందికి అంటించి ప్రాణాలతో పోరాటం చేస్తున్న ఘటన ఇది.ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి ఎనిమిది  వందల మందికి పైగా ఈ ప్రార్థనల్లో పాల్గొని వచ్చినట్లు తెలుస్తుండగా వారు ఎవరు ఎక్కడి నుండి వెళ్లారు వచ్చాక ఎక్కడెక్కడ తిరిగారు ఎంతమందికిఈ వ్యాధి అంటించారు అనే అంశాలపై ఆయా ప్రభుత్వాలు సీరియస్ గా ఆరా తీస్తున్నాయి.

తెలంగాణాలో ఆరుగురి మరణానికి కారణమై మరెంతో మందికి వైరస్ఢి వ్యాపింప చేసిన డి ల్లీలోని వెస్ట్ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్  ఇప్పుడు కరోనా వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా మారి వార్తల్లోకి ఎక్కింది.ప్రస్తుతం పోలిసుల అధీనం లో ఉన్న ఈ ప్రాంతం లో తెలిసి విరుసను వ్యాపింప చేశారా తెలియక పాల్గొన్న వారి నుండి ఈ వ్యాధి అంటుకుందా అనే కోణం లో విచారణ జరుగుతుంది.ఈ మేరకు  ఈ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చిన వారే కరోనా వ్యాప్తికి కారణం అయ్యారన్న కారణంగా మర్కజ్ మౌలానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోలీసులను ఆదేశించారు.. మర్కజ్ కు వచ్చిన వారి వివరాలను వెల్లడించాలని కోరినా, ఆయన వెల్లడించలేదని ఆరోపించారు.


చేతులు కాలాక ఆకులూ పట్టుకున్న చందం గా ఈ ప్రార్థనలకు వచ్చిన వారే, కరోనా వైరస్ ను అంటించుకుని, తమతమ ప్రాంతాలకు వెళ్లారని, దేశంలో నమోదైన కాంటాక్ట్ కేసులన్నీ వీరి నుంచి వ్యాపించినవేనని తేలడంతో కేజ్రీవాల్ ఆదేశాల మేరకు, ఢిల్లీ జాయింట్ సీపీ డీసీ శ్రీవాత్సవ నేతృత్వంలోని టీమ్, నిజాముద్దీన్ ప్రాంతానికి వెళ్లి, ఆ ప్రాంతంలోని దాదాపు 1200 మందిని క్వారంటైన్ చేసింది. మర్కజ్ మౌలానాపై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.


ఈ ప్రాంతంలోని పలు వీధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు, ప్రజల కదలికలపై డ్రోన్లతో నిఘా ఉంచారు. ఈ ప్రాంతానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టీమ్ కూడా వచ్చి, ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలను ప్రారంభించింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మొత్తం హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతాన్ని రసాయన ద్రావణాలతో శుభ్రం చేస్తున్నారని, ఇందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.


మత ప్రార్థనలు జరిగిన ప్రాంతంలోని రెండు కాలనీల్లో హౌస్ - టూ - హౌస్ మ్యాపింగ్ చేస్తూ, కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. మొత్తం పరిస్థితిపై ఓ ప్రకటన విడుదల చేసిన ఢిల్లీ ప్రభుత్వం "మార్చి 24 నుంచి ఢిల్లీ అంతటా లాక్ డౌన్ విధించాం. ప్రతి ఇంటి యజమాని, హాస్టల్ అడ్మినిస్ట్రేటర్, గెస్ట్ హౌస్, లాడ్జిలు తదితరాలన్నింటి చోటా సామాజిక దూరాన్ని పాటించాలి.కానీ ఈ ప్రాంతంలో క్వారంటైన్ ప్రొటోకాల్స్ లో అత్యంత ముఖ్యమైన సోషల్ డిస్టెన్స్ ను పాటించడం లేదు" అని పేర్కొంది. నిబంధనలను పాటించనందుకే కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య ఈ ప్రాంతంలో అధికంగా ఉందని ఢిల్లీ సర్కారు వెల్లడించింది.


కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కేజ్రీవాల్ సర్కారు సూచించింది. తొలి పాజిటివ్ కేసు రాగానే, నిజాముద్దీన్ ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేశామని తెలిపింది.కాగా, ప్రభుత్వం అడిగినట్లుగా తాము ప్రార్థనలకు వచ్చిన వారి జాబితాను అందించామని నిజాముద్దీన్ మర్కజ్ ప్రతినిధి డాక్టర్ మహమ్మద్ షోయబ్ వెల్లడించడం గమనార్హం. ఆదివారం నాడు ఈ జాబితాను తాము అధికారులకు ఇచ్చామని, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రులకు తరలించామని, వారి ట్రావెల్ హిస్టరీని కూడా అందించామని స్పష్టం చేశారు.

వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తున్నది కాబట్టి, ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ కోరుతుంది.ఇప్పటికైనా ప్రార్థనలకు వెళ్ళినవారు తమ గురించి తెలుపుతూ తాము తిరిగిన ప్రదేశాల వివారాలు ప్రజలకు ఇవ్వాలని లేకుంటే ఒకరి నుండి వందలాది మందికి వ్యాపించే కరోనా వైరస్ వల్ల తెలుగు రాష్ట్రాలలో పలు మరణాలు నమోదు అయి గత్తర లెపే ప్రమాదముంది.

ఇప్పటికే ఇండోనేషియా నుండి  మతప్రార్థనల పేరిట ఈ వ్యాధిని కరీంనగర్ లో అంటగట్టిన సంఘటన కరీంనగర్ను కోలుకొని దెబ్బ తీయ్యగ ఇప్పుడు తెలంగాణాలో నిజామాబాద్ హైదరాబాద్ ఆంధ్రాలో గుంటూరు,నెల్లూరు ,విశాఖ ఒంగోలు కర్నూల్ లో ఈ వ్యాధి స్నాక్రమించే అవకాశముందని ఈ మేరకు ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది.ప్రార్థన స్థలాల ద్వారా వైరస్ ను వ్యాపింప జేయాలని ఆలోచనతో ఎవరైనా కుట్ర చేశారా అనే అంశాన్ని సీరియస్ గా  తీసుకుని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విచారణ జరిపి ఎంతటి వారైనా కఠినం గా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

You Might Also Like