నిన్న మర్కజ్ యాత్రికులతో భయపడిపోయిన రాజన్న సిరిసిల్ల జిల్లా  ఇప్పుడు వలస కార్మికులతో వణికిపోతుంది.జిల్లాలో రెండు రోజుల క్రితమే రెండు కోవిడ్ కేసులు నమోదు కాగా  తాజాగా మరో రెండుకేసులు నమోదు కావడం తో  ప్రజలు  ఆందోళన చెందుతుండగా అధికారుల్లో కలవరం మొదలయింది.మరో 14  రోజులు ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు  అర్థరాత్రి నుండే అధికారులు కరోనా పాజిటివ్ వచ్చిన గ్రామాలకు కదిలి పరిస్థితులను సరిదిద్దుతున్నారు.

జిల్లాలో మంగళవారం మరో ఇద్దరికీ కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది.వీరిద్దరూ ముంబయి నుంచి వచ్చిన వలస కార్మికులే కావడం తో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.దీనితో ఇప్పటి వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం  ఏడు కేసులు నమోదు కాగా ఇందులో ఆరు కేసులు వేములవాడ మండలం నుండే నమోదు కావడం గమనార్హం. తాజాగా కరోనా నిర్దారణ ఇద్దరిలో ఒకరు  వేములవాడ మండలం లోని రుద్రవరంలో ముంబై వలస కార్మికుడు ,మరొకరు నాగయ్యపల్లి గ్రామానికి చెందిన  ముంబై నుంచి వచ్చిన వలస కార్మికురాలు.   ఈమె మొన్న నాగయ్యపల్లి లో కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తి భార్య.కాగా జిల్లాలో కాంటాక్ట్ తో కరోనా వ్యాపించిన తోలి కేసు ఇది కావడం విశేషం.


అయితే నాగయ్యపెల్లికి  చెందిన వ్యక్తి చందుర్తి,వేములవాడలో పలువురిని కలిసినట్లు తెలుస్తుండగా అధికారులు అప్రమత్తమై వారి వివారాలు సేకరిస్తూ వారిని హోమ్ క్వారంటైన్ కమ్మని ఆదేశాలు జారీ చేస్తున్నారు.జిల్లా వైద్యాధికారి సుమన్ రావు ,మహేష్ రావు నేతృత్వవం లో ఆరోగ్య సిబ్బంది  వీరిరువురు ఎప్పుడు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు వారు హోమ్ క్వారంటిన  లో ఉన్నారా లేదా వచ్చాకా ఎవరుఎవరినికలిసారు అనే అంశాలు ఆరా తీశారు.ఆయా గ్రామాలలో రసాయనాలు చల్లించి వైద్య సిబ్బంది తో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.కాగా రాష్ట్రాల మధ్య ప్రజా రవాణా నిలిపివేసిన ప్రభుత్వం అంతకు ముందు ముంబై మహారాష్ట్రలో నుండి వచ్చిన వలస కూలీలపై ద్రుష్టి పెట్టి వారిని స్వీయ నియంత్రణలో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

You Might Also Like