రోగం వస్తే కానీ తెలియలేదు ఆచారాలు వ్యవహారాలు అన్నట్లు ఉంది తెలంగాణాలో పరిస్థితి.రాష్ట్రము లో కోవిద్ - 19  ప్రబలుతుండగా తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వ పెద్దలు ప్రజలు పద్ధతులు పాటించాలని కోరుతున్నారు.ప్రతీ ఇంట్లో, ప్రతీ కార్యాలయంలో కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం ప్రగతి భవన్ లో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి హాజరయిన మంత్రులు అధికారులు చేతులు కడిగి మరి లోనికి ప్రవేశించారు.వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రగతి భవన్ లో ప్రత్యేక హ్యాండ్ వాషింగ్ కార్యక్రమం చేపట్టారు. ప్రగతి భవన్ లోకి వచ్చే ముందు చేతులు కడుక్కోవడానికి రెండు పెద్ద గంగాళాల్లో నీళ్లు పెట్టారు.

మంత్రులు, సీనియర్ అధికారులు కార్యాలయంలో వచ్చే ముందే అక్కడ చేతులు కడుక్కుని, శానిటైజర్ తో శుభ్రపరుచుకురావాలనే నిబంధన పెట్టారు. దీంతో మంగళవారం నాటి అత్యవసర, అత్యున్నత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రులు, ఇతర అధికారులు బయటే నీళ్లు, సబ్బుతో చేతులు కడుక్కొని లోపలికి ప్రవేశించారు. ప్రతీ ఇంట్లో, ప్రతీ కార్యాలయంలో ప్రజలు  ఇలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు.కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.ఇక్కడికి వచ్చిన మంత్రులు ఈటెల రాజేందర్,నిరంజన్ రెడ్డి ,పువ్వాడ అజయ్,ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ డిజిపి మహేందర్ రెడ్డి,సజ్జనార్,సినీ నటుడు నితిన్  లతో పాటు ఐఏఎస్ ,ఐపీఎస్ అధికారులు ఈ హ్యాండ్ వాష్ తరువాతే లోపలికి వెళ్లారు.

పాత కాలం లో ఇంటి ముందు ఉండే ఈ గంగాళం నీరు తో చేతులు కళ్ళు కడుకున్నాకే ఇంటికి లోపలి వెళ్లేవారు ప్రజలు.కాగా ప్రగతి భవన  లో ఈ కార్య క్రమం ఏర్పాటు తో వైరస్ కు దూరం గా ఉండాలని కేసిఆర్  భావిస్తున్నట్లు తెలుస్తుంది.కాగా ప్రజలు హ్యాండ్ వాష్ కార్యక్రం అమలు చేయాలనీ మంత్రి కేసి ఆర్ కుమారుడు కేటీఆర్ నిన్న పిలుపు నివ్వగా ఈ రోజు దానిని స్వయం గా తమ ఇంటి నుండే ప్రారంభించడం విశేషం.


You Might Also Like