ఆమెకు పెళ్లయింది పిల్లలు, భర్త ఉన్నారు అయినా  ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయిన ఒక వ్యక్తిని నమ్మి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంది. దిశ ఘటన  తర్వాత హైదరాబాద్‌లో అంతే సంచలనం సృష్టించిన తంగడపల్లి మహిళా హత్యాచారం కేసును పోలీసులు చాకచక్యం గా ఛేదించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి పైవంతెన కింద దారుణ హత్యకు గురైన మహిళ హత్య కేసులో విచారణ జరుపుతున్న సైబరాబాద్‌ పోలీసులు హంతకుడు తెచ్చిన అద్దెకారును గుర్తించి కేసును ఓ కొలిక్కి తీసుకువచ్చారు.కాగా హాతు రాలిది  సిక్కిం రాష్ట్రమని పేస్  బుక్  లో  పరిచయం తో  ఆమెను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పిన  ప్రేమికుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు.

ఈ ఘటనకు నిందితుడి బంధువు సహకరించినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా మృతదేహాన్ని పారేసేందుకు తీసుకొచ్చిన అద్దె ‘కారు’ను గుర్తించారు. అక్కడ సమర్పించిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ప్రధాన నిందితుడి (25)ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఫేస్‌బుక్‌ ద్వారా మహిళకు పరిచయమ కాగా అది వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు.  ఘటన జరిగిన రోజే మృతురాలిని సిక్కిం నుండి ప్రధాన నిందితుడు ఇక్కడికి రప్పించగా వీరిద్దరి మధ్య జరిగిన గొడవే హత్యకు  కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

హత్య చేసిన రాత్రి  హైదరాబాద్ శివారుల్లో మృతదేహాన్ని పారేసేందుకు కారును అద్దెకు తీసుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత తంగడపల్లి పైవంతెన కిందకు నైలాన్‌ తాడు సాయంతో మృతదేహాన్ని దించి తలను బండరాయితో మోదీ దుస్తులను అక్కడి నుంచి తీసుకెళ్లారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు బంగారు ఆభరణాలను వదిలేసి వెళ్లినట్లు సమాచారం. నిందితుడి బంధువు ఇందుకు సహకరించాడని అతని కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. సదరు మహిళ అదృశ్యమైనట్లు సిక్కింలో కేసు నమోదైంది.పేస్ బుక్ పరిచయాలు కొంప ముంచుతున్నాయనడానికి ఈ సంగటనే నే సాక్ష్యం కాగా మహిళలు తస్మాత్ జాగ్రత్త .

You Might Also Like