కరోనా మహమ్మారి చేస్తున్న విలయతాండవం తో కన్నీటిని పెట్టించే చిత్రమిది.ఇండోనేసియా దేశం లోని జకార్తాలో కరోనా నియంత్రణకు పనిచేస్తు వైరస్ బారిన పడి ప్రాణాలర్పించిన  డాక్టర్ హాడియో అలీ చివరి చిత్రమిది.చివరి సారిగా గేటు దగ్గర నిలబడి తన పిల్లలను ,గర్భిణీ గా ఉన్న భార్యనుగేట్ దగ్గరి నుండే చివరి సారిగా చూసి వీడ్కోలు చెబుతూ వెళ్లిన దృశ్యమది.ఏ వ్యాధి లేని తానూ కరోనా వైరస్ నుండి ప్రజలను రక్షించడానికి వెళుతూ తానూ మల్లి పిల్లలను కలుస్తాను అనుకుని అపరిచితుడిలా దూరం నుండే చూస్తున్న దృశ్యం కన్నీళ్లు

పెట్టుస్తుండగా తన భర్త డ్యూటీ కి వెళుతున్నాడనుకున్న ఆ భార్య ,తండ్రి సాయంత్రం తిరిగొస్తే అయన భుజాలపై వాలి ఆడుకోవాలని చూసే పిల్లలకు అయన జ్ఞాపకాలే మిగిలాయి.ఏమో ఆ డాక్టర్ అంతకు ముందే తనకు వైరస్ అంటుకుందని తెలిసి తన భార్య బిడ్డలకు దూరంగా ఉండాలని అనే ఆలోచన తో ఉంది ఉంటాడేమో అనుకున్నా అతను మాత్రం చని పోయే వరకు నిస్వార్ధం గా ఆ దేశ ప్రజలకు వైద్య సేవలందించిన మహానుభావుడే.ఆ ప్రజల దృష్టిలో నిజం గా హీరో నే .హాట్స్ అప్ యూ డాక్టర్ 

You Might Also Like