నల్గొండ జిల్లాలో ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య  వాగ్వివాదం  సంచలనం సృష్టించింది.నువ్వెంత అంటే నువ్వెంత అని మంత్రి ఎంపీ లు అమీ తుమికి దిగడం తో ఉద్రిక్త వాతావరణం నెలకుంది.ఇరువురు నాయకుల అనుచరులు ఎక్కడ ఘర్షణకు దిగుతారోనని అధికారులు పోలీసులు ఆందోళన చెందారు.చివరకు పరస్పర ఆరోపణల తోనేసమావేశం ముగియడం తో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశంలో తెలంగాణా విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మధ్య రైతు రుణమాఫీ విషయంలో మాటల యుద్ధం నడిచింది.

ఇద్దరు నేతలు  సమావేశం మందిరం లోనే మీడియా సమక్షం లోనే పరస్పర విమర్శలకు దిగారు. ఇద్దరి మధ్య వివాదం పెరిగి  వేదికపైనే నువ్వెంతా అంటే నువ్వెంతా అంటూ మాటల యుద్దానికి తెరలేపారు. ‘నువ్‌ పీసీసీ చీఫ్‌గా ఉండడం మీ సొంత ఎమ్మెల్యేలకే ఇష్టం లేదు’ అని ఉత్తమ్‌కుమార్‌పై మంత్రి జగదీష్‌ సెటైర్‌ వేయగా నువ్‌ మంత్రిగా ఉండడం జిల్లా ప్రజల దురదృష్టం’ అంటూ మంత్రికి ఉత్తమ్ తిప్పి కొట్టారు.ఎంపీకి, మంత్రికి మధ్య జరిగిన వాగ్వాదంతో కొద్దిసేపు అక్కడ  ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.ముందుగా సమావేశం లో  మాట్లాడిన  మంత్రి జగదీశ్వర్‌రెడ్డి   తెరాస ప్రభుత్వం రైతులకు సుమారు రూ.17వేల కోట్ల రుణమాఫీ చేసిందని పేర్కొనగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రుణ మాఫీ జరిగిందా అంటూ అభ్యంతరం తెలిపారు.


మంత్రి అబద్ధాలు చెబుతున్నారంటూ ఆరోపించారు. దీనికి సమాధానంగా మంత్రి మాట్లాడుతూ రుణమాఫీ వివరాలకు సంబంధించి లెక్కలన్నీ అసెంబ్లీలో ప్రస్తావించామని, కానీ, ప్రతిపక్షపార్టీ నాయకులు వినకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. ఏది పడితే అది మాట్లాడ వద్దనినిజాలుమాట్లాడాలని ఉత్తము కుమార్ రెడ్డి   కోరగా వరగా తాను మంత్రినని ఇక్కడ నేను చెప్పింది వినాలని జగదీష్ పే ర్కొన్నారు.దీనితో గొంతు పెంచకు అంటూ ఉత్తమ్ జగదీశ్ ను హెచ్చరించగా నువ్వు మధ్యలో మాట్లాడకు అంటూ జగదీశ్ ఉత్తమ్ ను కోరాడు

దీనితో నువ్వెంది అని ఉత్తమ్ అనగా ఆఫ్టర్ అల్ నువ్వు ఏందీ అని జగదీశ్ ఉత్తమ్ ను అనగా  నీ లెక్కేంది అని ఉత్తమ్ అతనికి ఎదురు సమాధానానిచ్చారు.ఈ సమయం లో పోలీస్ అధికారులు జోక్యం చేసుకోగా ఇరువురు వారిని మీరు ఇందులో జోక్యం చేసుకోవద్దని కోరారు.మీడియా చూస్తుందని ఎవరు మర్యాద తప్పారో అని జగదీశ్ మనుషులు అనగా మర్యాద ఇచ్చి పుచ్చు కోవాలని ఉత్తమ్ కోరారు.మొత్తానికి సభలో గందర గోళం జరగడం సంచలనం సృష్టించింది.చివరకు పరస్పర ఆరోపణల తోనే సమావేశం ముగియడం తో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

You Might Also Like