అవును దీపం వెలిగించాలన్న ఆయన పిలుపు ప్రభంజనమయింది. 130  కోట్ల భారతీయులు ఆ పిలుపునకు స్పందించి దీపాలు వెలిగించడం తో ఆ  కాంతిలో దేశం మెరిసింది అవని మురిసింది. పల్లెలనుండి పట్టణాల దాకా పిల్లల నుండి పెద్దల దాకా అందరు దీపాలతో ఇంటి ముందు కొచ్చారు.కొత్త కాంతులు నింపుతూ ఐక్యత రాగము పాడారు.ఆపత్కాలా సమయం లో ఒకరికొకరు అండగా ఉంటామనే భరోసాను మనసునిండా నింపుకుని అందరం ఒకటై కరోనాను తరిమేద్దామని ప్రతిజ్ఞబూనారు. క‌రోనాతో ఏర్ప‌డిన నిరాశ నుంచి ఆశ వైపు ప్ర‌జ‌ల్ని తీసుకువెళ్లేందుకు , క‌రోనాతో ఏర్ప‌డిన అంధ‌కారాన్ని పోగొట్టి  దివ్య వెలుగుల్ని ప్ర‌స‌రింప‌ చేయడానికి దేశం లోని 130 కోట్ల మంది భారతీయులు ఆదివారం  జ్యోతులు వెలిగించాలనిప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు టీతో దేశం యావత్తు ఒక్కతాటి పై నిలుచుంది దీపాలు వెలిగించగా ఆ కాంతి తో దేశానికే కొత్త శోభా సంతరించుకుంది. ప్ర‌ధాని మోడీ తన నివాసం లో దీపంచములను వెలిగించగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిలుకొవ్వొత్తులు వెలిగించారు. దేశ వ్యాప్తంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా లైట్లను ఆర్పివేసి క్యాండిల్స్, టార్చ్ లైట్లు  వెలిగించి కరోనా వైరస్ ని తిప్పికొట్టేందుకు మేము కూడా ముందు మీ వెంటే అన్నట్లు గా ప్రధానికి సంఘీభావాన్ని ప్రకటించడం దేశ ఐక్యతకు నిదర్శనం గా మారింది. దేశం లోని చిన్న పెద్ద మతం తో సంబంధం లేకుండా సరిగ్గా 9 గంటలకు 9 నిమిషాల పాటు దాదాపు అందరూ దీపాలు వెలిగించారు.హాట్స్ అఫ్ తో యూ మోడీ హాట్స్ అప్ తో యూ భారత్ 


You Might Also Like