తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో అటు సర్కార్  ఇటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్ 7 వరకు తెలంగాణాలో  పూర్తి గా కరోనా  కంట్రోల్ అవుతుందనే  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశలు   రోజు రోజుకు పెరుగుతున్నకరోనా కేసులు వల్ల అడియాసలు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారమ్ 71 కేసులు ఉండగా అనధికారికంగా అది నేటికీ 100 కి చేరినట్లు తెలిసింది. ఇందుకు ప్రధాన కారణం మంగళవారం ఒక్క రోజే మొత్తం 15 కేసులు నమోదైనట్లు మంత్రి ఈటెల  ఆధికారికంగా ప్రకటించడం పరిస్థితిని  తేటతెళ్ళం చేస్తుంది.

ఈ కేసుల్లో అత్యధికంగా  ఢిల్లీలోని మర్కజ్ సదస్సుకి వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. ఇక తెలంగాణలో ఇప్పటివరకూ అధికారికంగా కరోనా వైరస్ వల్ల ఆరుగురు చనిపోయారు. అదే సమయంలో కరోనా వైరస్ నుంచీ కోలుకొని 14 మంది డిశ్చార్జి అయ్యారు. అందువల్ల ప్రస్తుతం కరోనా ఉన్నది 83 మందికి అని అనధికారికంగా అనుకోవచ్చు. ఇలా కరోనా వైరస్‌పై లెక్కలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ప్రధానంగా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు ఏపీతోపాటూ తెలంగాణలో కూడా వందల్లో ఉండటం, వారిలో చాలా మందికి కరోనా వైరస్ సోకడం వల్ల ఇలా కేసుల సంఖ్య రానున్న రోజుల్లో మరింత  పెరుగవచ్చని  అధికారులు అంటున్నారు.

కాగా తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లిన  వారిని వారి తో కలిసి ఉన్న100 మంది ని వైద్య పరీక్షలకు పంపించి  ప్రభుత్వ  క్వారంటైన్‌కి తరలిస్తున్న అధికారులు వీరిలో ఏ ఒక్కరికి  కరోనా పాజిటివ్  వచ్చినాతెలంగాణ లో పరిస్థితి అదుపు తప్పుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదే జరిగితే రానున్న రోజుల్లో తెలంగాణ లో లాక్ డౌన్ మరింత కఠినంగా ఉండబోతున్నాడనేది నిజం.ఆ పరిస్థితులను ప్రజలు ఎలా ఎదుర్కొంటారో చూద్దాం మరి.

You Might Also Like