ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లు తానూ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి విలేకరులపై విరుచుక పడటం తెలంగాణ సి ఎం కేసీఆర్ కు అలవాటై పోయింది.సమస్యలెన్నున్నా ముఖ్యమంత్రి గా ప్రభుత్వాధి నేతగా వాటిని పరిష్కరించే బాధ్యత అయన పై ఉండగా ప్రజల పక్షాన ప్రశ్నించే బాధ్యత విలేకరులపై ఉంది.ఈ ప్రశ్నించే సమయం లో కొన్నిసార్లు ముఖ్య మంత్రికి తెలియని సమస్యలను విలేకరులు అయన దృష్టికి తీసుకు పోయే అవకాశం ఉండటం ప్రభుత్వానికే మంచిది.అయినా సీఎం కెసిఆర్ మాత్రం మీరు నన్ను అడిగేటోళ్లు ఐంద్రా అనే భావనతో పాటు తనకు తెలియని విషయం లేదు అనే వైఖరి తో ఉన్నట్లు తెలుస్తుంది.

అందుకే అయన విలేకరులపై విరుచుకుపడుతున్నట్లు విలేకర్లు బాధపడుతున్నారు.గత మూడు రోజులుగా ముఖ్య మంత్రి కెసిఆర్ ప్రెస్  మీట్ లు పేడు తుండగా రోజు మీడియా పై చిల్లర ప్రశ్నలు తలా ఉండే మాట్లాడుతున్నారా అంటూ అవహేళన చేసిన జర్నలిస్ట్  సంఘాలు పట్టించుకున్న పాపాన పోలేదని వారు వాపోతున్నారు.ఒక సారి ముఖ్య మంత్రి మాటలు పరిశీలిస్తే నిన్న అయన మాట్లాడుతూ ప్రస్తుత  సమయంలో మీడియా సానుకూల దృక్పదంతో వ్యవహరించాలని అంటూనే ఒక రిపోర్టర్ వేసిన ప్రశ్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆ విలేకరి 11  రోజులకు కుటుంబానికి 1500  రూపాయలు సరిపోతాయా  సర్ అని అడగగా  మరి లక్ష్య యాభై వేలు ఇమ్మంటావా అని ఎదురు దాడి చేస్తూ ఇలాంటి ప్రశ్నలు వేయడానికి ఇదిసమయమా అని మండిపడ్డారు.ఐ యామ్ సారి ఇలాంటి చిల్లర ప్రశ్నలు వేయకండి అని ఆయన అన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని ఆయన అన్నారు.

వస్తువుల ధరలపై మరో విలేకరి ప్రశ్నించగా, ఆయన కూడా అసహనం వ్యక్తంచేశారు. దరలు పెరగరాదని, పెరిగితే పిర్యాదు చేసే బాద్యత పౌరులుగా మీడియావాళ్లకు ఉండదా మీరు పోలీస్ కంప్లియెంట్ ఎందుకు చేయలేదని ఆయన ఎదురు ప్రశ్నలు వేశారు.రాష్ట్రము లో వైన్ షాప్ లు బంద్ చేస్తారా అని ప్రశ్నించిన ఓ విలేకరి ని నీకు కావాలా  అంటూ ప్రశ్నించగా అయన నేను తాగాను సార్ అంటూ పలు సార్లు బాధపడుతూ అనగా వైన్ షాప్ లు, పబ్ లు, బార్లు అన్ని బంద్ చేస్తామని అంటూ అవహేళన చేయడం గమనార్హం.మొన్నటి రోజు 20  వేల  మంది విదేశీయులు తెలంగాణ కు వచ్చారని వారిపై ఎం చర్యలు తీసుకుంటున్నారని అడిగిన  విలేకరిపై ఇదో  పనికిమాలిన ప్రశ్న అని తలకాయ ఉండే అడుగుతున్నావా అని ఏ పేపర్ నీదంటూ  అవిలేఖరినిఅడిగి మరి నీకు మీ ఆఫీస్ వాళ్లు గిదే ట్రైనింగ్ ఇచ్చారా అంటూ అవమానించడం తో ఆ విలేకరి కన్నీటి పర్యంతమయ్యారు.

కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా ఉండడానికి అన్ని చర్యలు చేపట్టామని, దానిపై నెగిటివ్ దోరణితో ఆలోచించవద్దని ముఖ్య మంత్రి తెలుపడం బాగానే ఉన్న ఆయన ప్రెస్లా మీట్కు తలపండిన సీనియర్ జర్నలిస్ట్క్ లే హాజరవు తుండగా వాగారిని ఇలా అవమాన చేయడం తో వారు ఆవేదనకు గురవుతున్నారు. అధికారం లో ఉన్న ఆయనకు ఎదురు చెప్పా లేక ,కనీసం తోటి జర్నలిస్ట్ ల మద్దతు దొరకక వారు లోలోపలే కుమిలి పోతున్నారు.కేసీఆర్ కు ప్రస్తుతం ఒకటి రెండు స్వంత పత్రికలూ ఉండగా రెండు మీడియా ఛానళ్లు ఉన్నాయి.

ఇవిగాక అయన మద్దతు దారులకు కొన్ని పత్రికలూ చానళ్ళు ఉండటం తో అయన విలేకరులను అవమానిస్తున్నారని జర్నలిస్ట్ సంఘాలు తెలుపుతున్నాయి.అసలే అత్తెసరు జీతం,మేనేజ్ మెంట్కు ఎప్పుడు తమను తీసివేయాలని ఆలోచన తో బాధపడుతున్న విలేకర్లు ముఖ్యమంత్రి కి ఎదురు తిరిగితే ఉన్న కొలువు విడిపోతుందని దీనితో భార్య బిడ్డలతో పస్తులుండాల్సి వస్తుందాని వాపోతున్నారు.

తన మంత్రి పదవి పోయినప్పుడు ,ఉద్యమ సమయం లో ఇదే పాత్రికేయులు ఆయనకు అండగా నిలిచినా సందర్భాలు ఎన్నో ఉండగా వాటిని మరిచి ఇప్పుడు అయన వ్యవహరిస్తున్న తీరు పాత్రికేయ రంగాన్ని కలవర పెడుతుంది. ఒకప్పుడు గౌరవం గా ఉన్న పాత్రికేయ వృత్తి పెట్టుబడి దారుల, రాజకీయనాయకుల ఈ రంగం లో   ప్రవేశం తో ఈ స్థితికి వచ్చిందని సమాజం లో పౌరుల పక్షాన పోరాడే పాత్రికేయులకు కనీస గౌరవం ఇవ్వాలని ప్రజలు కోరుతుండాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొంచెం విలేకరులపై సానుకూల స్థితికి రావాలని కోరుతున్నాం.చూడాలి ఆ రోజు ఎప్పుడు వస్తుందో మరి.

You Might Also Like