కరోనా తో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన దృష్ట్యా కేరళ లోని శబరిమల లో  మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన కొడియేట్టు ఉత్సవాలు  రద్దు చేశారు.బోర్డు పరిధిలోకి వచ్చే కేరళలోని ఇతర దేవాలయాలలో అన్ని పండుగలను రద్దు చేయాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) నిర్ణయించింది.

కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి అర్ధరాత్రి నుండి అమలులోకి వచ్చే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం దేశంలో 21 రోజుల లాక్డౌన్ ప్రకటించారు, ఈ వ్యాధిని ఎదుర్కోవటానికి "సామాజిక దూరం" మాత్రమే పరిస్కారం కాగా భక్తులను ఒక దగ్గరికి చేర్చ వద్దనే ఉద్దేశ్యం తోనే ఉత్సవాలను రద్దు చేసినట్లు ప్రకటించారు.కాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకారం, కోవిడ్ -19 తో 536  కేసులు  భారతదేశంలో నమోదు కాగా ఘోరమైన వైరస్ కారణంగా ఇప్పటివరకు 11 మంది మరణించారు.

You Might Also Like