లాక్ డౌన్ లోను ప్రభుత్వ అనుమతితో  తెరిచిన మద్యం షాపులలో మందుబాబుల కోనుగోళ్లతో  రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. తెలంగాణ‌లో 45 రోజులతర్వాత వైన్ షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు బుదవారం వేకువ జామునుండే వైన్ షాప్ ల ముందు కిలో మీట‌ర్ల దూరం క్యూలు క‌ట్టారు.బౌతిక దూరం ఉండాలని అధికారులు రింగ్లు వేయగా అందులో తమ చెప్పులు పెట్టి దూరంగా నీడలో కూర్చోని షాపులు వద్ద ఉదయం  10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం కొనుగోళ్లు జరిగాయి. మద్యం ప్రియులు పెద్ద సంఖ్యలో మద్యాన్ని కొనుగోలు చేశారు

తొలి రోజు రూ.100 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. చీప్ లిక్కర్‌పై 11శాతం ధరలను పెంచిన సర్కార్.. ఇతర మద్యంపై 16శాతం పెంచింది. కాగా, ఏపీ లో రెండు రోజులక్రితం మద్యం షాపులు తెరుచుకోగా మొదటి రోజు 67కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ రికార్డును తెలంగాణ బద్దలు కొట్టింది. ఏకంగా మందుబాబులు 100కోట్ల మద్యాన్ని కొనుగోలు చేసారు. ఇక ఎపిలో మూడో రోజు గ‌ణనీయంగా అమ్మకాలు ప‌డిపోయాయి.ధ‌ర‌లు అధికంగా ఉండ‌టంతో మందు బాబులు కేవ‌లం క్వార్ట‌ర్ తోనే స‌రిపెట్టుకుంటున్నారు.బీరు అమ్మ‌కాలు మాత్రం నిల‌క‌డ‌గా ఉన్నాయి.ఎపిలోని ప‌లు మ‌ద్యం షాపులు మ‌ద్యబాబులు రాక వెల‌వెల‌బోయాయి..

You Might Also Like