మోడీ ప్రకటించిన 21  రోజుల  లాక్ డౌన్ ఏప్రిల్ 14  తో ముగుస్తుండగా  లాక్ డౌన్ఎత్తివేయ డమ లేకా ఆంక్షలతో కూడిన  లాక్ డౌన్ ని ప్రకటించడమా లేక పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా లాక్ డౌన్ ను పొడగించడమా అనే  అంశం పై ప్రధాని మోదీ ఏప్రిల్ 6న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం మోదీ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే  లాక్ డౌన్ ను పొడగించదానికి బదులు   లాక్డౌన్ఎత్తివేస్తూ  బయట సభలు సమావేశాలు గుంపులుగా పెట్ట కుండా కొన్ని షరతులతో కూడిన లాక్ డౌన్ను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం మోదీ దేశంలో కరోనా సహాయకచర్యలు జరుగుతున్న తీరును దేశం లో పెరుగుతున్న కరోనా పాజిటివ్  సంఖ్యలను మరణాల రేటును ప్రజలు ప్రవర్తనను  నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అనేక వ్యవస్థలకు చెందిన ప్రతినిధులతో తాజాగా అయన ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా, వైద్యులకు కరోనా నుంచి రక్షణ కల్పించే పీపీఈ యూనిట్లు, మాస్కులు, చేతి తొడుగుల కొరత రాకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. తెలుస్తుంది.  కరోనా  వైరస్ పై   వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోడీ భారత్ లో కరోనా వైరస్ ను తరిమేసేందుకు వ్యూహాన్నితెలుపుతూనే   తమ దైనందిన కార్యకలాపాలు నిర్వహించుకునే వీలును కల్పించేలా నిర్ణయాలుతీసుకోనున్నట్లు తెలుస్తుంది.మరిన్ని రోజులు లాక్ డౌన్ కొనసాగితే దేశం లో ఆర్థిక మాంద్యం వస్తుందనే ఆలోచనతో షరతులతో కూడిన సడలింపును అయన ప్రకటించే అవకాశముంది.

You Might Also Like