తమ కుమారుని ఆరోగ్య పరిస్థితి బాగా లేదని  ఆసుపత్రికి తీసుకు వచ్చిన ఆ దంపతులకు నిరాశే ఎదురయింది.పరిస్థితి విషమించిందని పాట్నా లోని సౌకార్యవంతమైన ఆసుపత్రికిఅర్జెంట్ గా తీసుకు వెళ్లాలని వైద్యులు కోరగా కనీసం తమకు ఒక అంబులెన్సు లేదా వాహనాన్ని  సమకూర్చాలని బాబు తల్లి దండ్రులు కోరగా లాక్ డౌన్ ఉందని తాము ఎం సాయం చేయలేమని ఆసుపత్రి నిర్వాహుకులు చెప్పడం తో ఇక వారు చేసేదేమిలేక భుజాలపై బాలుడిని వేసుకుని పరిగెత్తసాగారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో బాలుడు మృతిచెందాడు. ఏడ్చినంత సేపు ఏడ్చి బాలుని మృతదేహన్ని భుజాలపై వేసుకుని రోదిస్తూ ఆ తల్లిదండ్రులు 48 కి.మీ దూరంలో ఉన్న తమ గ్రామానికి కాలినడకన చేరుకున్న ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే షాహోపర్‌ గ్రామానికి గిరీజ్‌కుమార్‌ దంపతులకు మూడేళ్ల వయసున్న బాలుడు ఉన్నాడు. అతడి ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో టెంపో వాహనంలో దగ్గరలోని జహనాబాద్‌లోని సర్దార్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారు బాలుడిని పరిశీలించి పట్నా వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. దీంతో అంబులెన్సు ఏర్పాటు చేయాలని ఆ బాలుని తల్లిదండ్రులు ఆస్పత్రి సిబ్బందిని కోరగా, లాక్‌డౌన్‌ సమయంలో ఏర్పాటు చేయడం కుదరదని తెగేసిచెప్పారు. ఇక వారు చేసేదేమిలేక భుజాలపై బాలుడిని వేసుకుని పరిగెత్తసాగారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో బాలుడు మృతిచెందాడు. దీంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతిఒక్కరు కంటతడి పెట్టారు.

స్థానికుల సహాయంతో బాలుని శవాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరారు. కాగా ఆస్పత్రి నిర్వాహకులు నిర్లక్ష్యం వల్లే తన కుమారుడి ప్రాణాలు పోయాయని తండ్రి ఎంతో ఆవేదన చెందాడు. దీంతో రంగలోకి దిగిన అధికారులు సర్దార్‌ఆసుపత్రి మేనేజర్‌ను వెంటనే సస్పెండ్‌ చేశారు. కొంతమంది వైద్యులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.ఇక ముందైనా  బాధితులకు  అవసరమైన కనీససౌకర్యాలు కల్పించాలని ఆరోగ్యసిబ్బందిని ఆదేశించారు

You Might Also Like