నిన్న జర్నలిస్టులపై దాడులు చేసిన పోలీసులు నేడు తెలుగు రాష్ట్రాలలో  వైద్యులపై ప్రతాపం చూపుతున్నారు.ఇటు తెలంగాణాలోని ఖమ్మం లో ఒక మహిళా వైద్యురాలిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వస్తుండగా మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి లో తాము ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు చికిత్స చేస్తుంటే, పోలీసులు అడ్డుకుంటున్నారని, దారుణంగా తిడుతూ, తమను కొట్టారని ఆరోపిస్తూ, వైద్యులు ధర్నాకు దిగారు.

టాస్ గెలిచి బాటింగ్ దిగిన ఇండియా టీం లాగా పోలీసులు రానున్న 20  రోజుల్లో వీలైనన్ని పరుగులు చేయాలన్నంత కసిగా ప్రజలపై విరుచుకు పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.విధుల నిర్వహణకు బయటకు వస్తున్నా జర్నలిస్టులకు వైద్యులకే ఇలా ఉంటె సామాన్య ప్రజలు పడే కస్టాలు దేవుడికే తెలియాలి.

వివరాల్లోకి వెళితే ఈ ఉదయం కొందరు మెడికోలు వెళుతుండగా, అడ్డుకున్న పోలీసులు వారిని ముందుకు కదలనీయలేదని తెలుస్తోంది.అత్యవసర కేసు కోసం ఆసుపత్రికి వెళుతుండగా ఒక వైద్యుడు తెలంగాణ పోలీసు చేత ఆమెను హ్యాండిల్ చేశాడని ఆరోపించారు.

తెలంగాణాలో అత్యవసర పరిస్థితికి లో  డ్యూటీకి వెళుతున్న నన్ను తోవలో పోలీసు అధికారులు ఆపారు. నేను నా ఐడిని చూపించాను కాని పోలీసులు నన్ను  నిలిపివేసి నా ఫోన్ కూడా తీసుకున్నాఋ.వారు నాపట్ల దురుసుగా ప్రవర్తించారని వారు తనను  పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని ఆ సమయం లో మహిళా పోలీసులు స్టేషన్లే లో లేరని  డాక్టర్ హిమాబిందు ఆవేదన వ్యక్తం చేశారు.

"నేను ఇతర వైద్యుల సహాయంతో రెండు టౌన్ పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు ఇచ్చాను. పోలీసు అయితే తప్పు గ్రహించిన అధికారి వ్రాతపూర్వక క్షమాపణ చెప్పారు" అని ఆమె చెప్పారు.కాగా ఆంధ్ర ప్రదేశ్ లో తాము వైద్యులమని ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పినా వినిపించుకోని పోలీసులతో మెడికోలు వాగ్వాదానికి దిగగా, వారిని కొట్టారన్నది ప్రధాన ఆరోపణ. దీన్ని నిరసించిన వైద్యులు స్థానిక లీలామహల్ సెంటర్ లో ధర్నాకు దిగారు. తమపై చెయ్యి చేసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, ధర్నా ప్రాంతానికి చేరుకుని, శాఖా పరమైన విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తామని హామీ ఇవ్వడంతో మెడికోలు ధర్నాను విరమించారు.కాగాముఖ్య మంత్రులు వద్దని చెబుతున్నప్పటికీ పోలీసులు తమ పెత్తనం చూపిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

You Might Also Like