ఈరోజు న్యూస్.ఇన్ ముందే చెప్పినట్లు  రెడ్ జోన్  కంటైన్మెంట్ ను ఎత్తివేస్తూ జి ల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే లు ప్రకటించడం తో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వేములవాడ సుభాష్ నగర్ లో  రెడ్ జోన్ విధించడం తో గత  కొన్ని రోజులుగా ఇంటికే  పరిమితమైన పట్టణంలోని  ఈ ప్రాంత వాసులు  రెడ్ జోన్ ను ఎత్తివేయడం తో ఆనంద నృత్యాలు చేస్తున్నారు.జి  ల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే నేతృత్వం లోని   అధికార బృందం వైద్యాధికారుల తో చర్చించి పరిస్థితి అదుపులో ఉండటంతో పాటు  కొత్త కేసులు నమోదు కాకపోవడంతో ఆదివారం   ఈ ప్రాంతంలో రెడ్ జోన్ ను కంటైన్మెంట్ ను ఎత్తివేస్తూన్నట్లు  ప్రకటించారు.

వాస్తావానికి శనివారామె ఈ రెడ్ జోన్ ను  ఎత్తివేసేందుకు నిర్ణయించగా అధికారులు గేట్లు తొలగించే సిబ్బంది అందుబాటులో లేకపోవడం  తో అది ఆదివారానికి వాయిదా ప డింది.ఆదివారం మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాదవి రాజు వైస్ చైర్మన్ మధు రాజేందర్ వార్డ్ సభ్యులు ఆ అజయ్ జిల్లా వైద్యాధికారి సుమన్ రావ్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పోలీస్ ఆ ధికారులు డిఎస్పీ చంద్రకాంత్  సి ఐ శ్రీధర్ లు మున్సిపల్ సిబ్బంది అక్కడ ఏర్పాటు చేసిన  గేట్ లను తొల  గించారు.దీనితో   ఈ ప్రాంతం లోనే అత్యధికం గా ముస్లిం లు ఉండటం తో రంజాన్ పండుగ సందర్బంగా అధికారులు స్వయంగా రంగం కి దిగి గేటులను తొలగించడం తో వారు సంతోషం  వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు  జైల్లో ఉన్నట్లు ఉందని ఇప్పుడు స్వేచ్ఛగా ఉందని వారు తెలుపు తున్నారు.


 జి  ల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే నేతృత్వం లోని   అధికార బృందం నిర్ణయాలను  వైద్యాధికారుల కృషిని అన్ని శాఖల  అధికారుల ప్రజా ప్రతినిధుల పనితీరును  ప్రజలు ప్రశంసిస్తున్నారు. కంటైన్మెంట్ ఎత్తివేసినందుకు వారు కృతజ్ఞతలు తెలియజేసారు.అయినప్పటికీ మే 7  వరకు లాక్ డౌన్ నిబంధనలు అమలు లో ఉన్నందున ప్రజలు ప్రమత్తం గా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

You Might Also Like