కల్లాల వద్దకే వచ్చి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని ప్రకటించిన ముఖ్య మంత్రి చంద్రషేకర్ రావు మారాలు మాటాలు గానే మిగిలి పోయాయి.అది అయన కొడుకు రాష్ట్ర మంత్రి అయినా కేటీఆర్ ప్రతినిధ్యంవహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం లో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు ఏకం గా పెట్రోల్ పోసి తమ ధాన్యాన్ని తగల పెట్టుకున్న ఉదంతమిది. .

ఆరుగాలం కస్టపడి పండించిన పంటను తమ చేతుల తో తామే కాల్చడానికి సిద్దపడ్డారంటే ఆ రైతులకు కు ఎంత కష్టం వచ్చిందో మరి.వివారాల్లోకి వెళితే  రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో తాము పండించిన  పంటను అటు ఐకెపి వారు ఇటు రైస్ మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని ఒక వేళా మిల్లర్ లు కొను గోలు చేసినా తాలు పేరుతో బస్తాకు ఐదు కిలోలు తగ్గిస్తున్నారని   రైతులు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు.లాక్ డౌన్ వేళా తినడానికి ఖర్చులకు ఇబ్బంది గా ఉందని తాము ధాన్యాన్ని అమ్మకానికిపెట్టగా ధాన్యం కొనుగోలుకు ఎవరు ముందుకు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్య మంత్రి మాటాలు అధికారులు పట్టించుకోవడం లేదని తమ ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేయడం లేదని రైతులు తెలుపుతూ   రైతులు తాము పండించిన ధాన్యాన్ని  పెట్రోలు పోసి తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక రైస్ మిల్లులకు ధాన్యాన్ని అమ్ముదామంటే తాలు పేరుతో బస్తాకు ఐదు కిలోలు తగ్గిస్తున్నారని వారు వాపోతున్నారు.వడ్లను పట్టించాలని ఒకసారి,బాగాలేవని మరో సారి వాటికి వంకలు పెడుతూ తాము చెప్పినట్టు నడుచుకుంటే కొనుగోలు చేస్తున్నారని లేకుంటే లేదని వారు వాపోతున్నారు.రైస్ మిల్లు ల వద్దకు తీసుకెళ్లిన ధాన్యాన్ని కూడా వెనక్కి పంపుతున్నారని రైతు ప్రభుత్వం అని చెప్పే కేసి ఆర్ ప్రభుత్వం లో ఇలా జరుగుతుందని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు.మరో రైతు తమకు ఐకెపి వాళ్ళు సహరించనందున ప్రభుత్వమే ముందుకు వచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.

రైతుల అందరం నష్టపోతున్నామని రైస్ మిల్లర్లకు వ్యతిరేకంగా ఈ సందర్భంగా నినాదాలు చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కు ముందుకు రావాలని లేకుంటే ఆత్మ హత్యలే శరణ్యమని వారు వాపోతున్నారు.అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని తాజా మరియు ఆసక్తికరమైన వార్తలకు ఇక్కడే దీనిపైనే క్లిక్ చేయండి ధన్యవాదాలు

You Might Also Like