ఇసుక రవాణాలో చేతివాటం చూపిన అధికారిపై ,మధ్య వర్తిత్వం వహించిన ఒక కానిస్టేబుల్ పై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు.ఈ ఘటన తో తప్పు ఎవరు చేసిన సహించనని, చర్యలు తప్పవనే సంకేతాలను జిల్లా యంత్రాంగానికి పంపించినట్లయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఇసుక అక్రమ రవాణ తో పాటు పట్టుకున్న టిప్పర్ ను బైండోవర్ చేసే అంశంలో పోలీసులు అవినీతికి పాల్పడ్డాడనే వార్తలు సోషల్ మీడియాలో వార్తలు ఆడియో టేపులు వైరల్ కాగా  ఈ  అంశం పై  జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే స్పందించారు.ఈ సంఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశించి వివరాలు తెప్పించుకున్న ఎస్పీ ఈ విషయంలో పోలీసుల పాత్రను తీవ్రంగా పరిగణించారు.

 అవినీతి ఎవరిదీ:ఇసుక రవాణాలో ఇంత డబ్బా

ఆడియో టేపుల్లో ఫోన్ కాల్ రికార్డు లో ఉన్న వాయిస్  ఇల్లంతకుంట ఎస్సై దే నని  తేలడం తో జిల్లా ఎస్పీ  వెంటనే ఇల్లంతకుంట ఎస్సైకి ఛార్జ్ మెమో జారీచేశారు.అలాగే మధ్య వర్తిత్వం వహించిన బోయినపల్లి కానిస్టేబుల్ అనిల్ ని హెడ్ క్వార్టర్స్ కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటన పై పూర్తి స్థాయి విచారణకు ఎస్పీ  ఆదేశించారు. జిల్లా పోలీస్ యంత్రాంగంలో ఇటువంటిఅవినీతి కార్యక్రమాలకు తావు లేదని ఎట్టి పరిస్థితుల్లో బాద్యులను ఉపేక్షించమని  తదనుగుణంగా జిల్లా అధికారులు నడుచుకోవాలని  

ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు.అవినీతి పై జిల్లా ఎస్పీ స్పందించడం తో పాటు బాద్యుల పై చర్యలకు ఉపక్రమించడం తో జిల్లా పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయింది.కాగా ఈ వార్తను అవినీతి ఎవరిదీ:ఇసుక రవాణాలో ఇంత డబ్బా అనే శీర్షిక తో ఈరోజున్యూస్.ఇన్ ప్రచురించిన సంగతి పాఠకులకు తెలిసిందే. కాగా ఈ సంఘటన పై బాద్యులు ఈరోజు న్యూస్ ను సంప్రదించడం తో స్పందించి వార్తను ఈ-పేపర్ లో పబ్లిష్ చేసాము .ఇంకా అవినీతి తో బాదపడుతున్న వారెవరైనా ఉంటె నిజాయితీ గా వార్తలు రాసే ఈరోజును సంప్ర దించాలని కోరుతూ స్పందించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాము ...హాట్స్ అప్ టు  యు సర్ ... 

You Might Also Like