1.                                                                      

                                                                                     (బుధారం శ్రీనివాస్ )

పెద్దపల్లి జిల్లా  రామగుండం 11  A గని కార్మికుడు సంజీవ్ అదృశ్యం విషాదం గా ముగిసింది.11 రోజుల తర్వాత గనిలో 18 వ లెవల్ ల్లో  కార్మికుడు మృతదేహాన్ని రెస్క్యూ టీం కనుగొని శవాన్ని బయటకు తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నారు.పూర్తి గా కుళ్లిపోయిన స్థితి లో మృత దేహం ఉండగా గని పైనే పోస్ట్ మార్టం కు ఏర్పాటు చేసి అక్కడే శవాన్ని కుటుంబ సబ్యులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రెండు రోజుల క్రితం గనిలో శవం కంపు కొట్టడం తో అదే ప్రాంతం లో వెతికిన రిస్కు టీం కు సంజీవ్ శవం లభించడం తో కుటుంబ సభ్యులు బోరోబోరున విలపిస్తున్నారు.తమకు దేవుడు అన్యాయం చేసాడని విలపించడం పలువురిని కలిచి వేసింది.

ఈనెల 7న జీడీకే11 ఏ గనిలో విధులకు వెళ్లిన కార్మికుడు కోడెం సంజీవ్‌ అదృశ్యం కావడంతో గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా . కార్మికుడి ఆచూచీ పది రోజులు దాటినా దొరకక పోవడంతో శుక్రవారం డీడీఎంఎస్‌ మైనింగ్‌ బాల సుబ్రహ్మణ్యం 11ఏ గనిలోకి స్వయంగా దిగారు. ఈసందర్బంగా సంబంధిత అధికారులు, కార్మికులను కలిసి పరిస్థితులను ఆరా తీశారు. ఇప్పటివరకు కార్మికుని అదృశ్యమై జరిగిన పరిణామాలను అధికారులతో డీడీఎంఎస్‌ సమీక్షించారు. కార్మికుడు సంజీవ్‌ ఆచూకీ దొరికేంత వరకు గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించడం తో మైనింగ్ సిబ్బంది శుక్రవారం రాత్రి సంజీవ్ శవాన్ని గుర్తించారు.కాగా మృతి చెందిన సంజీవ్ కు ఔటింగ్ చెప్పడం అలవాటు లేదని ఒక్కో సారి ఐదు ఆరు రోజులకు అతను తిరిగి వచ్చేవాడిని అధికారులుఇప్పుడు ఆరోపించడం కొసమెరుపు.

You Might Also Like