ఢిల్లీ లోని నిజాముద్దీన్ లో తబ్లిగ్ జమాత్ సమావేశాలకు వెళ్లిన వారికీ కరోనా వైరస్ అంటుకుందని ఇంకా అక్కడ దేశ విదేశీయులు ప్రార్థనలు జరుపుతున్నందున అది వెంటనే మూసివేసి నివారణ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యం గా ప్రధాని మోడీకి,అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు  చెప్పింది తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అనే తెలుస్తుంది.

ఈ విషయాన్నీ తెలంగాణ వైద్య మంత్రి ఈటెల రాజేందర్ స్వయం గా చెబుతున్నాడు కూడా .తాను ఎప్పటికప్పుడు పరిస్థితులపై ప్రధాని తోమాట్లాడుతానని అన్ని మీకు చెప్పాల్నా అంటూ  కేసీఆర్ సారు బాహాటం గా చెపుతున్నప్పటికీ ఎవరు ఇంత పెద్ద ప్రమాదం నుండి ప్రధానిని కేసీఆర్ అలర్ట్ చేస్తాడని ఉహించి ఉండరు.లేకుంటే ఢిల్లీ లోని మర్కజ్ లో ఇప్పడి వరకు 1500  వందల మందికి పైగా ఆశ్రయం పొందుతూ ఉండగా వైరస్ వ్యాపించి మరింత కరోనా కేసులు నమోదయ్యేందుకు దోహద పడేవారు.

తెలంగాణ లో కరోనా కేసులు పాజిటివ్ రాగా వారు ఎక్కడికి వెళితే ఈ వ్యాధి వచ్చిందని ఆరా తీసిన అధికారులు ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినా వారికి ఎక్కువగా ఈ వ్యాధి సంక్రమించింది  అని తెలుసుకుని ముఖ్యమంత్రికి నివేదించారు.దీనికి స్పందించిన సీఎం తనకెందుకు అని ఊరుకోక పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ సర్కార్కు వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పడం గమనార్హం.

ముఖ్య మంత్రి సూచనలకు స్పందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మర్కజ్ లో వారిని కాళీ చేయించడం నిర్వహులపై కేసులు పెట్టడం ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేయడం వెంట వెంటనే జరిగి పోయాయి.దీనితో పరిస్థితి అదుపులోకి రావడం తో వైరస్ వ్యాప్తిని అడ్డుకుని అనేక ప్రాణాలను కాపాడ గలిగారు. మొత్తానికి కరోనా వ్యాప్తి చెందకుండా చుసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం గా గ్రేట్.

You Might Also Like