ముఖ్య మంత్రి కేసీఆర్  కు కోపం వచ్చింది.కోపాన్ని ఆపుకోలేకా అయన శాపము పెట్టాడు.అంతే కాదు తనకు కోపం తెప్పించిన వారిని వదలమని ప్రతిజ్ఞ చేసాడు.ఇంతకు తెలంగాణ ముఖ్యమంత్రిని అంతగా బాధించిన సంఘటన ఏమిటి.అయనకు వ్యక్తి గతం గా అంత నష్టం చేసినా వారెవ్వరూ.రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్న చందంగా వారిని వెంటనే అయన శిక్షించా లేడా మరి ఎందుకు అయన వారిని శిక్షించడానికి సమయం తీసుకుంటున్నాడు ఇవన్నీ తెలియాలంటే ఈ కథనం చదవండి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము ఏర్పడేందుకు ఉద్యమించినా కేసీఆర్ తెలంగాణ ముఖ్య మంత్రిగా తన రాష్ట్రము అన్ని రంగాలలో అగ్రగామిగా ఉండేలా చూస్తున్నడనుటలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపత్యం లో ఆయన రాష్ట్రము లో ఈ వ్యాధి ప్రబలకుండా అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.అయితే తానూ ఇంతగా ప్రజా క్షేమాన్ని కోరుతుంటే  కోన్ని మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో కరోనా గురించి జరుగుతున్న దుష్ప్రచారం ఆయనను కలిచి వేసింది.దీనిపై  అయన తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు.అంతే కాదు  ఇలాంటి రాతలు రాసేవారికి కరోనా వ్యాధి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శపించారు.

కరోనా పట్ల  దుష్ప్రచారం చేసినా వాళ్ళను ఉపేక్షించే  ప్రసక్తే లేదని తెలిపారు. అలాంటి దిక్కుమాలిన చిల్లరగాళ్లకు, దుర్మార్గులకు కరోనా అంటుకోవాలని అయన శాపం పెట్టారు.మేము గొప్పవాళ్లం మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరన్న గర్వంతో కొందరు మూర్ఖులు పెట్రేగిపోతున్నారని, ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచం, దేశం ఆగం అవుతున్న సమయంలో వారి చిల్లర ప్రచారాలు న్యాయమేనా అని ప్రశ్నించారు. తమనెవరూ ఏమీ చేయలేరేమనుకుంటున్నారు వారు కాని, వారు అంతకు అంత అనుభవించేలాతానూ చేసి చూపిస్తానని హెచ్చరించారు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ముందుగా కరోనా పట్టుకోవాలని నేను శాపం పెడుతున్నానని రెండు మూడు సార్లు వేదికపై గుణిగారు కూడా.


ప్రపంచమంతా కరోనా మహమ్మారితో తీవ్ర భయభ్రాంతులకు గురవుతోందని పనికిమాలిన దుర్మార్గులు మాత్రం ప్రజలను ఫేక్ న్యూస్ తో తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదనివారిని హెచ్చ రిం చారు.కాగా ఈ విషయమై తీవ్ర ఆగ్రహం తో ఉన్న సీఎం సారూ ఇలా శాపాలు పెట్టడం సోషల్ మీడియాలో వైర్ అవుతున్నాయి. తానూ పగబడితే ఎంతటి వారినైనా అణిచివేసే గుణం ఉన్న కేసీఆర్ దృష్టిలో పడ్డావాళ్ళు తస్మాత్ జాగ్రత్త.

You Might Also Like