సూర్య పేట లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. ఎలాగైనా అక్కడకరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయాలని సీఎం ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం రంగం లోకి దిగింది. ఫలితంగా కేసుల అదుపులో విఫలమయ్యాడని సూర్యాపేట డీఎంహెచ్‌వో నిరంజన్‌పై బదిలీ వేటు పడింది. జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతిని అదుపు చేయలేదన్న కారణంతో డీఎంహెచ్‌వోపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయన స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా డీఎంహెచ్‌వో సాంబశివరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  సాంబశివరావు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకుండా సమర్థవంతం గా  పనిచేశారని ఆయనను ఇక్కడికి బదిలీ చేశారు.

మరో  వైపు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్య శాఖ సంచాలకుడు శ్రీనివాస్‌ బుధవారం సూర్యపేటలో పర్యటించారు.   ప్రత్యేక హెలికాప్టర్‌లో దిగిన వీరు నేరుగా కరోనా కేసులు అధికంగా నమోదైన సూర్యాపేట కూరగాయాల మార్కెట్‌ను సందర్శించారు. కరోనా కట్టడికి క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టరేట్‌లో కరోనా నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కట్టడికి చేపాట్టాల్సిన చర్యలను వారికి సూచించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని లేకుంటే వేటు తప్పదని హెచ్చరించారు.

సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు 80 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదు క్వారంటైన్‌ కేంద్రాల్లో 210 మంది ఉండగా దాదాపు 4,346 మంది గృహనిర్బంధంలో ఉన్నారు. కాగా ముఖ్య మంత్రి ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగడంతో సూర్యాపేట లో హడావుడి నెలకుంది.అధికారుల పనితీరుతో కరోనా వైరస్ అంటుకునే స్టేజి దాకా రాకుండా చూడాలని వారుప్రయత్నిస్తున్నారు.కాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌  తర్వాత అత్యధిక కేసులు సూర్యాపేట జిల్లాలోనే నమోదవుతున్నాయి.


ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌కు జిల్లా నుంచి ఎక్కువ మంది హాజరు కావడం, అధిక శాతం వైరస్‌ బారిన పడడం, వీరంతా కూరగాయల వ్యాపారులు కావడంతో ఇతరులకు వీరి నుంచి వైరస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో ప్రత్యేక కార్యాచరణతో జిల్లాలో పరిస్థితిని అదుపు తీసుకువచ్చే చర్యలు చేపట్టింది.

మరిన్ని ఆసక్తికరమైన వార్తలకు ఇక్కడే దీనిపైనే క్లిక్ చేయండి ధన్యవాదాలు click here click me

You Might Also Like