వేములవాడ లో గతం తాలూకు మర్కజ్ మరకలు వీడి గ్రీన్ జోన్లోకి ప్రవేశిస్తామనుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల ఆశలు అడియాశలే  అయ్యాయి.ఇప్పుడిప్పుడే కొంత వెసులుబాటు దొరుకుతున్న తరుణంలో జిల్లాలో నమోదయిన రెండు కేసులతో మల్లి పరిస్థితులు ఏట్లా ఉండబోతు న్నాయనే ఆందోళనతో ప్రజలు ఉండగా ,ఎంత అప్రమత్తంగా ఉంచినా ఇదెక్కడి కరోనా కేసులు రా బాబు అంటూ జిల్లా యంత్రాగము తలలు పట్టుకు కూర్చుంది.మరో 14  రోజులు ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు ఆదివారం అర్థరాత్రి నుండే అధికారులు కరోనా పాజిటివ్ వచ్చిన గ్రామాలకు కదిలి పరిస్థితులను సరిదిద్దుతున్నారు.

జిల్లా లోని వేములవాడ మండలం లోని నాగయ్యపల్లి గ్రామంలో ఒకరికి ,సిరిసిల్ల మండలం లోని చంద్రంపేటలో ఇంకొక వ్యక్తికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా ఆదివారం  నిర్ధారణ అయ్యింది. వీరిద్దరూ 45  సంవత్సరాల వయసు వారే కావడం తో పాటు ఇద్దరు ,మహారాష్ట్ర నుండి వచ్చిన  వలస కార్మికులు కావడం గమనార్హం.సిరిసిల్ల అర్బన్ చంద్రంపేటలో బొంబాయి నుండి వచ్చిన వలస కూలీ ఒకరికి కరోనా పాజిటివ్ గా  నిర్థారణ కాగా వేములవాడ రూరల్ మండలంలోని నాగయ్యపల్లి  గ్రామానికి చెందిన వలస కార్మికుడికి ఈ వ్యాధి సోకినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఇతడు మహారాష్ట్ర నుంచి   వచ్చిన ఓ వలస కూలీ గా గ్రామాస్తులు తెలుపుతున్నారు.

హైదరాబాద్ నుండి వైద్య పరీక్షల రిపోర్ట్ రాగానే జిల్లా వైద్యాధికారి సుమన్ రావు ,మహేష్ రావు లు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే లకు ఈ విషయాన్ని తెలిజేయడం తో వెంటనే ఉన్నతస్థాయి అధికారుల సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది.వీరిరువురు ఎప్పుడు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు వారు హోమ్ క్వారంటిన  లో ఉన్నారా లేదా వచ్చాకా ఎవరుఎవరినికలిసారు అనే అంశాలు ఆరా తీశారు.ఆయా గ్రామాలను కంటైన్మెంట్ జోన్ లుగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకుని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

దీనితో ఆదివారం అర్ధరాత్రి చంద్రంపేటలోని 12  వార్డ్కు  మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పోలీస్ పట్టాన సి ఐ వెంకట నర్సయ్య లు చేరుకొని రసాయనాలు చల్లించి హద్దులను ఏర్పాటు చేశారు.అల్లాగే వేములవాడ నాగయ్య పల్లి  లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి ఈ రెండు కేసుల నమోదు తో జిల్లా రెడ్  జోన్ లోకి వెలితే అరిస్థితులు ఎలా ఉంటాయో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


You Might Also Like