రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ లోమరో రెండు కరోనా పాజిటివ్ కేసులు  నమోడు కావడంతో  జిల్లా యంత్రాంగం మరో సారి అప్రమత్తమైంది.దీనితో జిల్లాలో ఇప్పటి వరకు మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో  సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఇప్పటికే ఇక్కడి నుండి పాజిటివ్ తో గాంధీ ఆసుపత్రిలో ఒకరు  చికిత్స పొందుతుండగా స్థానిక లక్ష్మి గణపతి కాంప్లెక్ లోక్వారంటైన్ లో ఉన్న ముగ్గురిలో మరో ఇద్దరికీ   మొదట నెగటివ్ గా ఉస్మానియా ఆసుపత్రి ర్టిజల్ట్  వచ్చినట్లు ప్రకటించగా అనుమానం తో మహేష్ రావు నేతృత్వం లోని స్థానిక డాక్టర్ల బృందం పట్టు బట్టి మరోసారి టెస్టింగ్ కు పంపారు. దీనితో పది రోజుల తరువాత మరో ఇద్దరికీ పాజిటివ్ఢి గా తేలింది.

డిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన నలుగురు యువకులను వైద్యులు గుర్తించి కరోనా పరీక్షలకు పంపగా మొదటగా ఒకరికి పాజిటివ్ గా తేలగా మరో ఇద్దరికీ శనివారం నిర్దారణ అయినట్లు కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రకటించాడు.మరొకరికి ఈ సారి నెగటివ్ గా రాగా మరో సారి పరీక్షించే అవకాశమున్నట్లు తెలుస్తుంది.వీరి బంధువులను ఇప్పటికే క్వారంటైన్ లో ఉంచి వైద్యులు పర్య వేక్షిస్తుంన్నారు.

ఇప్పటికే జి  ల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశానుసారం వేములవాడలో సుభాష్ నగర్ ,ఉప్పుగడ్డ ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటిస్తూ పోలీసులు వైద్య సిబ్బంది పూర్తి గా తమ అధీనం లోకి తీసుకున్నారు.ఆ ప్రాంతం లోకి ఎవరు రాకుండా బరిఖేడ్లు పెట్టి ప్రతి ఇంటిని పర్య వేస్సాక్షిస్తున్నారు.జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే నేతృత్వం లోని   పోలీస్ అధికారులు చంద్రకాంత్ ,శ్రీధర్ లు ప్రజలు బయటకు రాకుండా గట్టిబందో బస్తు నిర్వహిస్తున్నారు. ఈ రెండు పాజిటివ్ లతోవేములవాడ లో రెడ్ అలెర్ట్ ప్రకటిస్తున్నామని బయటకి వస్తే కేసులు నమోదుచేస్తామని కలెక్టర్ హెచ్చ్రించారు.కాగా ఇప్పటి వరకు ఆరంజ్ జోన్ లో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ కేసులతో రెడ్ జోన్ కిందికి రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశముంది.దీనితో ఈ నెల 20  నుండి లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితులు దాదాపు కనుమరుగైనట్లే.దీనితో జిల్లాలో మరికొన్ని రోజులు లాక్ డౌన్ కొనసాగే అవకాశం ముంది. 


You Might Also Like