కరోనా మహమ్మారి పై సమరభేరి మ్రోగించిన ప్రభుత్వం మార్చి నెలాఖరు వరకు లాక్ డౌన్ ప్రకటించినఅత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసింది.ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు రానప్పటికీ సోమవారం రోడ్ల పై జన సంచారం ఎక్కువ కనిపించింది. ఒకరికి మించి జనాలు బైకులు ,కార్లలో వెళ్లడం రోడ్లపై జనాలు గుమిగూడి ఉండటం ను స్వయంగా చూసిన వరంగల్ పో లీస్ లు డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశాలానుసారం రంగం లోకి దిగారు.స్వయం గా వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ సోమవారం రాత్రి రంగం లోకి దిగి పట్టణం లో స్వయంగా తిరుగుతూ వాహనాలను నిలుపుదల చేశారు.

కరోనా ఉధృతిని దానివల్ల కలిగే ప్రాణనష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంట్లో ఉండాలని కోరగా బయట ఎందుకు తిరుగుతున్నారని అయన  ప్రశ్నించారు.నిర్లక్ష్యం వల్ల మీ ప్రాణాలు పోవడమే కాకుండా జిల్లా మొత్తం ప్రమాదంలో పడుతుందని అయన పేర్కొన్నారు. ఇక నుంచైనా బాధ్యతగా వ్యవహరించి కరోనా కట్టడికి ప్రభుత్వానికి ,జిల్లా యంత్రాంగానికి సహకరించాలని హితోపదేశం చేశారు.నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మొదటి తప్పుగా భావించి ఇంతటితో వదిలేస్తున్నామని ఇలాంటి తప్పులు మునుముందు పునరావృతమైతే అరెస్టు చేస్తామని అయన  హెచ్చరించారు.

కరోనా దృష్ట్యా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని  ఆదేశించారు .నిరంతరం గస్తీ కాస్తూ రోడ్లపై ఇష్టారీతిన వాహనాలు వెళ్లకుండా చూడాలన్నారు. ఒకే చోట సమూహంగా ఉండకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


You Might Also Like